Friday, April 26, 2024
- Advertisement -

హైద‌రాబాద్ జూలో 8 సింహాల‌కు క‌రోనా కలకలం!

- Advertisement -

కరోనా మహమ్మారి హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్కులోనూ కలకలం రేపుతోంది. దేశంలోనే తొలిసారిగా జంతువులు క‌రోనా బారిన ప‌డ్డాయి. నెహ్రూ జూలాజికల్‌ పార్క్‌లోని ఎనిమిది ఆసియా సింహాల‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. ప్రస్తుతం సింహాల ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని జూ అధికారులు స్ప‌ష్టం చేశారు. హైదరాబాద్ జూ పార్కులో 8 సింహాలు కరోనా తరహా లక్షణాలతో బాధపడుతున్నట్టు అధికారులు గుర్తించారు.

ఈ సింహాల నుంచి నమూనాలు సేకరించిన అధికారులు, ఆ నమూనాలను సీసీఎంబీ (సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ)కి పంపించారు. పా‌ర్క్‌లో పని చేస్తున్న వన్యప్రాణి పశువైద్యులు సఫారిలో ఉంచిన సింహాలలో ఆకలి లేకపోవడం, ముక్కు నుంచి రసి కారడం అలాగే, దగ్గు వంటి కొవిడ్ లక్షణాలను గమనించారు.

వెంటనే సింహాల న‌మూనాల‌ను సేక‌రించి ప‌రీక్ష‌ల నిమిత్తం సీసీఎంబీకి పంపారు. వీటిలో నాలుగు ఆడ సింహాలు, నాలుగు మగ సింహాలు మహమ్మారి బారిన ప‌డ్డాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అధికారులు ఈ నెల 2 నుంచే జూ పార్కును మూసివేశారు. గతేడాది ఏప్రిల్‌లో న్యూయార్క్‌లోని ఓ జూలో ఎనిమిది పులులు, సింహాలు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. ఆ తర్వాత హాంగాంగ్‌లో కుక్కలు, పిల్లుల్లో వైరస్‌ లక్షణాలను గుర్తించారు.

ఈటల రాజేందర్‌కు హైకోర్టులో ఊరట.. కలెక్టర్ ఇచ్చిన నివేదిక చెల్లదు..

కంగనా రనౌత్‌ ట్విటర్ ఖాతాకు బ్రేక్.. కారణం అదేనా?

వామ్మో.. ఆ ఊరిలో ఒక్కసారే 600మందికి క‌రోనా పాజిటివ్.. ఇద్దరు మృతి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -