Friday, April 26, 2024
- Advertisement -

విజయశాంతి నటించిన పవర్ ఫుల్ 10 పాత్రలు ఇవే!

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా తిరుగులేని గుర్తింపు సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ విజయశాంతి. సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన ‘కిలాడి కృష్ణుడు’ మూవీ ద్వారా విజయశాంతి హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది. తర్వాత నటించిన కర్తవ్యం, ప్రతిఘటన, రేపటి పౌరలు, నేటిభారతం, ముద్దులమావయ్య, గ్యాంగ్‌లీడర్‌, జానకిరాముడు, చిన్నరాయుడు వంటి సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలవడంతో తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ గా చాలా కాలం కొనసాగారు.

విజయశాంతి నటించిన కొన్ని డైనమిక్ పాత్రల గురించి తెలుసుకుందాం కర్తవ్యం మూవీలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో, ప్రతిఘటన మూవీలో అన్యాయాన్ని ఎదిరించే నేటి మహిళ పాత్రలో , సంధ్యారాగం సినిమాలో అమాయకమైన మహిళగా అందరినీ మెప్పించారు. అలాగే గ్యాంగ్ లీడర్ లో మెగాస్టార్ చిరంజీవికి దీటుగా నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది.వెంకటేష్ తో కలిసి నటించిన శత్రువు సినిమాలో పోలీస్ గెటప్ లో హీరోని మించి నటించింది. ఒసేయ్ రాములమ్మ మూవీ లో దొరలను ఎదిరించి అనగారిన మహిళగా,తన నటన ఈ సినిమాకు మంచి గుర్తింపును అందించింది. సరిలేరు నీకెవ్వరు ఈ సినిమాలో తన పాత్ర ఎంతో హానెస్ట్ గా, ఎంతో సింపుల్ గా అద్భుతంగా నటించిది.

Also read:హైపర్ ఆది అసలు వ్యక్తిత్వాన్ని బయటపెట్టిన.. దొరబాబు భార్య అమూల్య!

విజయశాంతి 2006లో వచ్చిన నాయుడమ్మ సినిమాలో చివరిసారిగా నటించింది. తరువాత పొలిటికల్ ఎంట్రీతో సినిమాలకు దూరమయ్యారు. అయితే 13 ఏళ్ల విరామం తరువాత మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో తల్లి పాత్రలో వెండితెరపై రీఎంట్రీ తో అందరినీ ఆశ్చర్యపరిచారు.

Also read:నాని రిజెక్ట్ చేసిన సూపర్ హిట్ సినిమాలు ఇవే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -