Saturday, April 27, 2024
- Advertisement -

దాని వాడ‌కం అంద‌రికీ తెలియ‌దు

- Advertisement -
  • స‌మాజం కోసమే ప‌నిచేస్తున్నా
  • ప్ర‌చార చిత్రంపై రాఖీసావంత్ స్పంద‌న‌

అది వాడ‌డానికి అంద‌రికీ రాదు. దాని వాడ‌కం తెలియ‌క‌, అవ‌గాహ‌న లేక కొంద‌రు సుఖ వ్యాధుల బారిన ప‌డుతున్నారు… అందుకే దానిపై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు నేను యాడ్ చేస్తున్నా… అని హీరోయిన్ రాఖీ సావంత్ చెబుతోంది. నేను ఏదో తప్పు చేయడం లేదు..అందరికీ తెలియాల్సిన దానినే చేస్తున్న అంటూ సమర్థించుకుంటోంది ఈ హాట్‌భామ‌. త‌ర‌చూ వివాదాల్లో ఈ గుమ్మ ఇటీవ‌ల ఒక కండోమ్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా మారింది. దాని ప్రమోషన్ యాడ్‌లో రెచ్చిపోయి నటించింది.

స‌న్నీలియోన్ మాదిరి శృంగార తారగా రాఖీసావంత్ పాపులారిటీ పొందింది. స‌న్నీలియోన్ దానికి సంబంధించిన ప్ర‌క‌టన‌లో న‌టించిన‌ప్పుడు కూడా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఇప్పుడు ఈమె న‌టించ‌డంతో కూడా విమ‌ర్శలు వెల్లువెత్తాయి. ఫైర్‌బ్రాండ్‌గా ముద్ర‌ప‌డిపోయిన రాఖీ ఏ విషయాన్నైనా మోహ‌మాటం లేకుండా చెప్పేస్తుంది. ఇటీవల సన్నీలియోన్ కు ఎదురైనా సమస్య రాఖి సావంత్ కూడా ఎదురైంది. కండోమ్ యాడ్ విషయంలో రాఖీ సావంత్ విమ‌ర్శ‌లు ఎదుర్కొంటోంది.

తనపై వస్తున్న విమర్శలకు దీటుగా బదులిచ్చే ప్రయత్నం చేసింది ఈ బాలీవుడ్ హాటీ. తాను సిగ్గుపడేంత పని చేయలేదని సమర్ధించుకుంటోంది. సమాజం కోసమే తాను ఈ యాడ్‌లో నటించానని పేర్కొంది. ఇప్పటికి మన దేశంలో కండోమ్ గురించి సరైన అవగాహన జనాల్లో లేదని, వారిలో అవగాహన కల్పించడం అవసరం అని గుర్తుచేస్తోంది.

తానేమి సభ్య సమాజం సిగ్గుపడాల్సిన విధంగా వ్యవహరించడం లేదని,సమాజం కోసమే ఇలాంటి యాడ్ చేస్తున్నానని చెబుతోంది. చాలామంది వాటి వాడ‌కం తెలియక, సరియైన అవగాహన లేక సుఖవ్యాధులను తెచ్చుకుంటున్నార‌ని, అవగాహన కల్పించేందుకు ప‌ని చేస్తున్నాన‌ని తెలిపింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -