Saturday, May 18, 2024
- Advertisement -

చంద్రబాబుకు షాకింగ్ బ్రేకింగ్ న్యూస్….. వైకాపా జంపింగ్ ఎంపీలకు బిగెస్ట్ షాక్

- Advertisement -

ఉంటుందా? ఊడుతుందా? అన్న ఊహాగానాల నేపథ్యంలో కేంద్రం నుంచి ఒక స్పష్టమైన సంకేతం వచ్చింది. తాను వెనకాల ఉండి తన భజన బ్యాచ్‌తో తిట్టిస్తూ వ్యక్తిగతంగా తనపై కేసులు పడకుండా పబ్బం గడుపుకుంటూ సాగించిన రెండేళ్ళ బాబు మార్క్ పొలిటికల్ డ్రామాకు తెరదించడానికి మోడీ రంగం సిద్ధం చేశాడు. చంద్రబాబు పొలిటికల్ డ్రామాలకు భారీ కౌంటర్ ఇవ్వనున్న మోడీ. వాజ్‌పేయి నాటి ఎన్డీఏ ప్రభుత్వ పథకాలను, ఆఖరికి కార్గిల్ విజయాన్ని కూడా తన అకౌంట్‌లో కూడా యాడ్ అయ్యేలా చేసుకున్న చంద్రబాబు బిజెపికి ఉపయోగపడింది ఏమీ లేదు. ‘ఎపికి వస్తే మోడీని అరెస్ట్ చేయిస్తా’ అన్న మాటలు అదనం. తెలుగు నాట బిజెపిని అంటరాని పార్టీగా చూపడంలో, మతం రంగు వేయడంలో బాబు భజన మీడియాదే అగ్రస్థానం. ఇక ప్రత్యేక హోదాతో సహా రాష్ట్ర ప్రయోజనాలన్నింటినీ తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం తాకట్టుపెట్టిన బాబు మోడీకి సాగిలపడ్డాడు. ప్రత్యక హోదా ఇవ్వనందుకు మోడీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తే బాబు అండ్ ఆయన భజన మీడియా ఆ పోరాటాలను అట్టర్ ఫ్లాప్ చేశారు. ఇక ప్యాకేజ్ ప్రకటించిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే ప్యాకేజీ బ్రహ్మాండం అని ఎపి ప్రజలను మాయ చేశాడు. అయితే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ పోలవరంతో సహా అన్ని పాపాలనూ కేంద్రం అకౌంట్‌లో వేయడానికి రెడీ అయ్యాడు చంద్రబాబు. బాబు భజన మీడియా రాతల్లోనే ఆ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. అందుకే ఇప్పుడు మోడీ కూడా బాబుకు ఫస్ట్ కౌంటర్ ఇవ్వనున్నాడు. అది కూడా అలా ఇలా కాదు. దిమ్మతిరిగి బొమ్మ కనపడే స్థాయి కౌంటర్.

వైకాపా నుంచి గెలిచిన రోజుల వ్యవధిలోనే టిడిపిలోకి జంప్ చేసిన సీనియర్ మోస్ట్ ఎంపి ఎస్‌పి వై రెడ్డితో సహా కొత్తపల్లి గీత లాంటి ఎంపిలు అందరిపై అనర్హత వేటు వేసే ప్రయత్నం జరుగుతోంది. ఈ కార్యక్రమం జరుగుతున్న విషయాన్ని కూడా బాబుకు సన్నిహితుడు అయిన వెంకయ్య నాయుడు మాటల ద్వారానే తెలియచేశాడు మోడీ. ఫిరాయించిన నెలల వ్యవధిలోనే జంపింగ్ ఎంపిలపై అనర్హత వేటు వేయాలని చెప్పుకొచ్చాడు వెంకయ్యనాయుడు. ఇప్పుడు మోడీ ప్లాన్‌ని అర్థం చేసుకున్న కొత్తపల్లి గీత కొత్తగా మోడీ పల్లవి పాడుతుండడం గమనార్హం. మోడీకి, తనకు సత్సంబంధాలు ఉన్నాయని చెప్తున్నారు గీత. అయతే మోడీ మాత్రం ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నాడని తెలుస్తోంది. చంద్రబాబు అండ్ కోకు తన మార్క్ పొలిటికల్ షాక్ ఎలా ఉంటుందో తెలియచేయడానికి ఈ ఎంపిల అనర్షత వేటు అంశాన్ని తెరపైకి తెచ్చాడు మోడీ. గుజరాత్ ఎన్నికల్లో మోడీ విజయం సాధిస్తే మాత్రం ఇక ఆ తర్వాత నుంచీ స్వపక్షంలో ఉండి విపక్షంలా వ్యవహరిస్తున్న చంద్రబాబులాంటి వాళ్ళందరికీ సినిమా చూపించడానికి రెడీ అవుతున్నాడు మోడీ. లాలూ ప్రసాద్ యాదవ్, శశికళ లాంటి విషయాల్లో మోడీ వ్యవహరిస్తున్న తీరుతో ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న చాలా మంది నాయకులు హడలిపోతున్నారు. మరి తెగదెంపులు అయితే ఖాయంగా కనిపిస్తున్న నేపథ్యంలో బాబు అండ్ కో పై మోడీ మార్క్ నిర్ణయాలు ఎలా ఉంటాయో…ఆ వ్యూహాలను చంద్రబాబు ఎలా తిప్పికొడతాడో చూడాలి మరి. ఎంపిలపై అనర్హత వేటు పడితే మాత్రం చంద్రబాబుకు చుక్కలు కనిపించడం ఖాయం. ఆ తర్వాత ఎమ్మెల్యేలపై కూడా అనర్హత వేటు వేయాల్సిన పరిస్థితి వస్తుంది. అదే జరిగితే రాష్ట్ర రాజకీయాలు శరవేగంగా మారిపోతాయనడంలో సందేహం లేదు. అలాగే బాబు-మోడీల బంధం తెగిపోతే ఆ తర్వాత జగన్‌తో పోరాడటానికి కూడా బాబు అండ్ కో చాలా కష్టపడాల్సి వస్తుందనడంలో సందేహం లేదు. కేంద్రంలో పరిచయాలు, ప్రభుత్వంలో భాగస్వామ్యంతో చాలా విషయాల్లో ఎస్కేప్ అవుతూ వస్తున్న చంద్రబాబుకు ఆ అండ లేకపోతే మాత్రం చాలా కష్టమే అవుతుంది. ఇప్పటికే జగన్ పాదయాత్రను ఎలా ఎదుర్కోవాలో తెలియక సతమవుతున్న టిడిపి అండ్ బ్యాచ్‌కి మోడీ హ్యాండ్ ఇస్తే మాత్రం 2019 ఎన్నికల యుద్ధాన్ని ఎదుర్కోవడం అసాధ్యం అనేలా ఉంటుందనడంలో సందేహం లేదు. ఓటుకు నోటుతో సహా పెండింగ్‌లో ఉన్న కేసుల తుట్టె కదిలిందంటే ఆ తర్వాత మిగిలేది నిద్రలేని రాత్రులే అని రాజకీయ విశ్లేషకులు విస్పష్టంగా చెప్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -