Friday, May 3, 2024
- Advertisement -

కేదార్‌నాథ్ వ‌ర‌ద‌లు మ‌ళ్లొస్తున్నాయ్‌

- Advertisement -
  • వ‌ర‌ద‌ల ఇతివృత్తంలో బాలీవుడ్‌లో ఓ సినిమా

ఉత్త‌రాఖండ్ రాష్ట్రంలో 2013లో వ‌ర‌ద‌లు బీభ‌త్సం సృష్టించాయి. ప్ర‌జాజీవ‌నం స్తంభించిన ఆ ప్ర‌కృతి విప‌త్తును మ‌రువ‌లేనిది. ఇప్ప‌టికీ ఆ వ‌ర‌ద‌లు క‌ళ్ల‌ముందే ఉన్నాయి. ఆ వ‌ర‌ద‌ల నేప‌థ్యంలో బాలీవుడ్‌లో ఓ సినిమా తీయ‌బోతున్నారు. ఆ వ‌ర‌ద‌ల నేప‌థ్యంలో ప్రేమ‌క‌థను తీసుకొస్తున్నారు అభిషేక్ క‌పూర్.

ఆ వ‌ర‌ద‌ల ఇతివృత్తంతో ‘కేదార్‌నాథ్‌’ అనే ప్రేమకథా సినిమా తీస్తున్నారు. ధోని సినిమా హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్ హీరోగా, సైఫ్‌ అలీఖాన్ త‌న‌య సారా అలీఖాన్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఆమె తొలిసారిగా వెండితెర‌కు పరిచయమవుతోంది.

అయితే ఈ సినిమా కోసం కళాదర్శకులు, కంప్యూట‌ర్ గ్రాఫిక్స్ (సీజీ) నిపుణులు భారీ కృత్రిమ వరదలు పుట్టించబోతున్నారు. ఈ చిత్రం కోసం వరద ప్రమాద దృశ్యాలను త్వరలో షూటింగ్ చేయ‌నున్నారు. ముంబయిలోని ఓ స్టూడియోలోనే కేదార్‌నాథ్‌ పట్టణాన్నిసృష్టించారు. పట్టణంలోని వీధులతో పాటు ప్రధాన ఆలయం సెట్లను రూపొందించారట. ఇక వదరలు పుట్టించడమే తరువాయి. దీని కోసం భారీ ఎత్తున వాటర్‌ ట్యాంకర్లను, వందల మంది ఆర్టిస్టులను వినియోగిస్తున్నారు. ఈ వ‌ర‌ద‌ల కోసం ఎంత ఖ‌ర్చు పెడుతున్నారో తెలిస్తే షాక‌వుతారు. ఈ సెట్టింగ్స్‌కు రూ.7 కోట్లు ఖర్చు పెడుతున్నార‌ట‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -