Friday, May 10, 2024
- Advertisement -

రకుల్‌కు ఛాన్స్ ఇచ్చారా ..లేక ఛాన్స్ తీసుకుందా ?

- Advertisement -

హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ అతి త‌క్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా ఎదిగింది.మ‌హేశ్‌,రామ్ చ‌ర‌ణ్,ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల‌తో సినిమాలు చేసింది ర‌కుల్‌. అయితే స‌డ‌న్‌గా రకుల్ క్రేజ్‌కు తెర‌ప‌డింది. ఉన్న‌ట్లు ఉండి కొత్త భామ‌లు ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇవ్వ‌డంతో ర‌కుల్‌కు అవ‌కాశాలు బాగా త‌గ్గాయి.ఇంకా చెప్పాలంటే అమ్మ‌డు చేతిలో ఒక్క సినిమా కూడా లేదు.ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో శ్రీదేవి పాత్ర మిన‌హా రకుల్ న‌టిస్తున్న తెలుగు సినిమాలు ఏమి లేవు.

అయితే తాజాగా ఆమె రెండు సినిమాల్లో ఛాన్స్ వ‌చ్చిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. వాటిలో ఒక‌టి నాగ చైత‌న్య‌తో కాగ ,రెండోది నితిన్‌తో. గ‌తంలో నాగ‌చైత‌న్య‌తో క‌లిసి ఓ సినిమా చేసింది ర‌కుల్‌. వెంకటేష్ – నాగచైతన్య కాంబినేషన్‌లో బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘వెంకీ మామ’ లో హీరోయిన్‌గా ర‌కుల్‌ను ఎంపిక చేశార‌ని తెలుస్తుంది. ఇక నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఓ సినిమా తెర‌కెక్కుతోంది.ఈ సినిమాలో కూడా హీరోయిన్‌గా ర‌కుల్‌ను సెలెక్ట్ చేశార‌ని స‌మాచారం.అయితే ఈ రెండు సినిమాలు కూడా పైర‌వీలు ద్వారానే వ‌చ్చిన‌ట్లు తెలుస్తుంది. ర‌కుల్‌కు అక్కినేని ఫ్యామిలీతో మంచి రిలేష‌న్‌షిప్ ఉంది.

దీంతోనే ఆమెకు నాగ చైత‌న్య సినిమాలో ఛాన్స్ వ‌చ్చిన‌ట్లు సినీ వ‌ర్గాల‌లో వినికిడి వినిపిస్తోంది. ఇక నితిన్ సినిమాలో ఛాన్స్ రావడానికి కారణం.. ఇండ‌స్ట్రీకి చెందిన ఓ పెద్ద‌ వ్య‌క్తి సిఫారుసు చేయ‌డం ద్వారానే ఆ అవ‌కాశం వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ఏది ఏమైన‌ప్ప‌టికి రకుల్ ఒకేసారి ఇలా రెండు సినిమాల్లో ఛాన్స్ ద‌క్కించుకోవ‌డంపై అంద‌రు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -