తెలుగు ఇండస్ట్రీలో కెరటం చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయిన బాలీవుడ్ బ్యూటీ రకూల్ ప్రీత్ సింగ్ తర్వాత వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో నటిస్తూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ రూపొందిన బాలీవుడ్ మూవీ దే దే ప్యార్ దే ఘనవిజయం సాధించడంతో రకుల్ బాలీవుడ్ లో బిజీగా మారారు.
రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం హిందీలో అర్జున్‌కపూర్ తో సర్దార్ కా గ్రాండ్‌సన్ సినిమాలో నటిస్తోంది. ఇప్పటివరకు గ్లామరస్ రోల్స్ లో కనిపించిన రకుల్ ఈ చిత్రం కోసం ట్రక్ డ్రైవర్ గా మారింది. ఈ కామెడీ డ్రామాలో ఇంకా జాన్ అబ్రహామ్, అదితిరావ్ హైద్రీ, నీనా గుప్త ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

కాస్వీ నాయర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలోనే ఓ సీన్ లో భాగంగా రకుల్ ట్రక్ డైవింగ్ చేసిందట. తాజాగా ఈ అమ్మడు మాట్లాడుతూ..నాకు వ్యక్తిగతంగా డ్రైవింగ్ అంటే ఇష్టం. షూటింగ్ మొత్తం చాలా ఫన్ గా సాగింది. ట్రక్కు డ్రైవింగ్ చేయడం అంత సులభం కాదు. కానీ నేను చాలా సులభంగా కాన్ఫిడెంట్ గా ట్రక్కును డ్రైవ్ చేశా. ట్రక్కును ఎలా డ్రైవ్ చేయాలో చెప్పేందుకు సెట్స్ లో ఓ ట్రక్కు డ్రైవర్ ఉండేవాడు.
ట్రక్కును ఎలా హ్యాండిల్ చేయాలో చెప్పేవాడు. నా డ్రైవింగ్ స్కిల్స్ చూసి సెట్స్ లో ఉన్నవారు షాక్ అయ్యారు. జీవితంలో ఇదో అద్భుతమైన అనుభవం అంటూ పోస్ట్ చేసింది. ట్రక్ డ్రైవ్ చేస్తున్న ఫొటో ను రకుల్ సోషల్ మీడియా లో షేర్ చేయగా అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారం