Monday, April 29, 2024
- Advertisement -

“పుష్ప 2 ” ప్లాన్ మొత్తం మారిందా ?

- Advertisement -

గత ఏడాది డిసెంబర్ లో వచ్చి టోటల్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ నే షేక్ చేసిన టాలీవుడ్ మూవీ ” పుష్ప “. ఈ మూవీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటనకు అన్నీ ఇండస్ట్రీల ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా హిందీలో పుష్ప రాజ్ సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు.. 300 కోట్లకు పైగా వసూళ్లు సాదించి బాలీవుడ్ ట్రేడ్ వర్గాలను ముక్కున వేలేసుకునేలా చేసింది పుష్ప మూవీ. సుకుమార్ తీసిన ఈ రా అండ్ రాస్టిక్ మూవీకి హిందీ ఆడియన్స్ ఫిదా అయ్యారు. దీంతో పుష్ప పార్ట్ 1 కి కొనసాగింపుగా తెరకెక్కుతున్న ” పుష్ప ది రూల్ ” పార్ట్ 2 ను మరింత గ్రాండ్ గా తెరకెక్కించేందుకు సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడట. దాంతో ముందుగా అనుకున్న కథను చాలా వరకు మార్పులు చేసి యాక్షన్ డోస్ ఇంకాస్త పెంచనున్నట్లు సమాచారం. .

ముఖ్యంగా హిందీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకొని కథ కు ఈ సారి పార్ట్ 2 లో బాలీవుడ్ స్టార్ హీరోను రంగంలోకి దించే పనిలో పడిందట పుష్ప టిమ్. ఇక మొదటి పార్ట్ లో పరిచయం అయిన బన్వీర్ సింగ్ షెకావత్ పాత్ర మాదిరి పార్ట్ 2 లో కూడా ఒక బలమైన నెగిటివ్ పోలీస్ పాత్రను డిజైన్ చేశారట సుకుమార్. దాని కోసం మొదట విలక్షణ నటుడు విజయ్ సేతుపతిని అనుకున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు తాజాగా ఆ పాత్ర కోసం బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు బాలీవుడ్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఏది ఏమైనప్పటికి పుష్ప పార్ట్ 1 ఊహించని స్థాయిలో విజయం అందుకోవడంతో.. పార్ట్ 2 లో చాలానే మార్పులు చేశారట సుకుమార్. ఇక ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. మరి పుష్ప పార్ట్ 2 తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంకెన్ని సంచలనలు క్రియేట్ చేస్తాడో చూడాలి.

Also Read

అంతా బాగుంది కానీ.. ఏదో తక్కువైంది ?

విలన్ గా ఎన్టీఆర్.. హీరో ఎవరో తెలుసా ?

గాడ్ ఫాదర్ 2..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -