Friday, April 26, 2024
- Advertisement -

మరో పవర్‌ఫుల్‌ పాత్ర లో అనసూయ

- Advertisement -

బుల్లితెరపై తన సత్తా చాటుతూ వచ్చిన హాట్ యాంకర్ అనసూయ ఇప్పుడు వెండితెరపై కూడా తన సత్తా చాటుతుంది. జబర్ధస్త్ కామెడీ షో లో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన అనసూయ అనతి కాలంలోనే తన ప్రతిభ ఏంటో నిరూపించుకుంది. కింగ్ నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయనా చిత్రంలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా.. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’చిత్రంలో రంగమ్మత్తగా దుమ్మురేపింది. ఈ పాత్రతో అనసూయకి టాలీవుడ్‌లో మంచి క్రేజ్ వచ్చింది.

Also Read: వామ్మో.. నాని సినిమాకు ఇంత డిమాండా..?

ప్రస్తుతం సుకుమార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా పుష్ప సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. పుష్ప సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతోందో అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ‘పుష్ప’ టీజర్‌ చూస్తే అర్థమౌతుంది. ఈ చిత్రం ఎర్ర గంధపు అక్రమ రవాణాతో ముడిపడి ఉన్న వారి జీవితాల చుట్టూ తిరుగుతుంది. ఇందులో గిరిజన యువతిగా కనిపించబోతున్న హీరోయిన్ రష్మిక మందన్న.

ఇక తాజాగా పుష్ప సినిమాలో అనసూయ నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే పుష్ప సినిమాలో అనసూయ పాత్రను పవర్‌ఫుల్‌గా సుకుమార్ డిజైన్ చేసినట్టు సమాచారం. పస్తుతం అనసూయ పాత్రకు సంబందిచిన కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది.
భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్, ముత్యంశెట్టి మీడియా నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 13న ఐదు భాషల్లో రిలీజ్ కానుంది.

Also Read : మళ్ళీ ప్రేమలో పడిన గోవా బ్యూటీ..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -