Thursday, April 25, 2024
- Advertisement -

రంగస్థలం స్వీకెల్ రాబోతుందా?

- Advertisement -

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన రామ్ చరణ్ చేసిన చిత్రాలు తక్కువే అయినా.. సూపర్ హిట్స్ తో మంచి క్రేజ్ సంపాదించాడు. వారసత్వపు మచ్చ పడకుండా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించాడు రామ్ చరణ్. సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం’చిత్రం రామ్ చరణ్ కెరీర్ లో ఓ మైలు రాయిగా నిలిచిపోయింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లింది.

చెవిటి వాడి పాత్రలో రామ్ చరణ్ తన నట విశ్వరూపాన్ని చూపించాడు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీలో నటిస్తున్నాడు. మరోవైపు తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ లో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ రెండు సినిమాల తరువాత ఆయన శంకర్ దర్శకత్వంలో ఒక పాన్ ఇండియా సినిమా చేయనున్నాడు.

ఈ మూవీ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. అది ‘రంగస్థలం’ సినిమాకి సీక్వెల్ అనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకి సీక్వెల్ చేయాలని సుకుమార్ – చరణ్ ఇద్దరూ కూడా నిర్ణయించుకున్నారని చెప్పుకుంటున్నారు. మరి ఎలాంటి సబ్జెక్ట్ తో సుకుమార్ రాబోతున్నారు.. రామ్ చరణ్ ని ఎలా చూపించబోతారు అన్న క్యూరియాసిటీ ఫ్యాన్స్ లో నెలకొంది.

ప్రభాస్ మూవీలో కొత్త ప్రపంచాన్ని చూస్తారు : నాగ్ అశ్విన్

కిడ్నాప్ చేసిన ఎస్ఐను హత్య చేసిన మావోయిస్టులు

కరోనాపై సంచలన వ్యాఖ్యలు చేసిన రేణు దేశాయ్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -