Friday, May 3, 2024
- Advertisement -

మంచు నేప‌థ్యంలో సినిమా.. క‌ష్ట‌ప‌డుతున్న రామ్‌, ప్ర‌వీణ్ స‌త్తారు

- Advertisement -

గుంటూరు టాకీస్‌, గరుడవేగ సినిమాలు తీసి దర్శకుడిగా ప్రవీణ్ సత్తారు మంచి మార్కులు వేసుకున్నాడు. ఆ నేప‌థ్యంలోనే ఇప్పుడు ద‌ర్శ‌కుడు మోస్ట్ టాలెంటెడ్ ద‌ర్శ‌కుడిగా అయ్యాడు. ఇప్పుడు ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో న‌టుడు రామ్ పోతినేని ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభ‌మైంది. అయితే ఈ సినిమాపై ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం వెల్ల‌డైంది.

ఈ సినిమా మొత్తం మంచు థీమ్‌తో కూడుకున్న‌ది అని తెలుస్తోంది. దీనికోసం భారీగా బ‌డ్జెట్ అవుతుండ‌డంతో ఈ సినిమాను నిర్మిస్తాన‌ని చెప్పిన మొద‌టి నిర్మాత త‌ప్పుకోగా ఇప్పుడు హీరో రామ్ పెద‌నాన్న బ్యాన‌ర్ స్ర‌వంతి మూవీస్‌లో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. మంచు నేప‌థ్యంలో సినిమా తెర‌కెక్కిస్తుండ‌డంతో సినిమాలో చాలా భాగాన్ని మంచు దేశాలు స్విట్జర్లాండ్, ఐస్ ల్యాండ్‌లలో తీయనున్నారంట‌.

అయితే ఈ సినిమా కోసం భారీగా ఖ‌ర్చు కానుంది. ఎందుకంటే మంచులో షూటింగ్ అంటే మామూలు విష‌యం కాదు. చాలా టైమ్ వేస్ట్ అయ్యే వ్య‌వ‌హారం. ఒకే షాట్‌ను అనేకసార్లు తీయాలి.. వాటిలో మంచిదాన్ని ఎంపిక చేయాలి. కొన్ని షాట్లకు విజువల్ ఎఫెక్ట్స్ తప్పనిసరిగా చేయాలి. మంచులో తీవ్రంగా క‌ష్ట‌ప‌డాలి. వీట‌న్నిటి నేప‌థ్యంలో ఖర్చు బాగా త‌డిసిపోద్ది.

కేవ‌లం ప్రవీణ్ సత్తారుపై న‌మ్మకంతో భారీ బ‌డ్జెట్‌తో సినిమా తీయ‌డానికి రామ్ పోతినేని, స్ర‌వంతి మూవీస్ ముందుకు వ‌చ్చారు. మ‌రీ ఆ సినిమా ఆ విధంగా హిట్ట‌వుతే పెట్టుబడి వ‌స్తే హీరో నిల‌బ‌డ‌తాడు. లేకుంట అంతే సంగ‌తులు.. భారీ న‌ష్టం మూట‌గ‌ట్టుకోవాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -