Saturday, May 18, 2024
- Advertisement -

వివేక్ ఒబేరాయ్, స్నేహా, యంగ్ హీరో, హీరోయిన్…. ఈ రేంజ్ నటులు ఒకే సినిమాలో

- Advertisement -

రొటీన్ రెగ్యులర్ మాస్ మసాలా సినిమాలే అయినప్పటికీ బోయపాటి శ్రీను సినిమాలను మన తెలుగు హీరోలు మాత్రం చాలా చాలా ఇష్టపడతారు. ఏరికోరి బోయపాటితో సినిమా చేయాలనుకునే హీరోల లిస్ట్ చాలానే ఉంది. స్టార్ హీరోలతో సినిమా చేసిన ఎక్కువ సందర్భాల్లో సూపర్ హిట్సే ఇచ్చాడు బోయపాటి. అందుకే మాస్ సినిమా చేయాలనుకునే తెలుగు హీరోలందరి ఫస్ట్ ఛాయిస్ బోయపాటి అవుతోంది. బన్నీకి సరైనోడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన బోయపాటి ఇప్పుడు చరణ్‌తో అదే మేజిక్ రిపీట్ చేయడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ఆల్రెడీ కండలు పెంచే పనిలో ఉన్నాడు చరణ్.

చరణ్ ఇప్పటి వరకూ చేసిన రచ్చ, నాయక్‌లాంటి సినిమాల కంటే డబుల్ త్రిబుల్ ఇంపాక్ట్ ఉండే రేంజ్‌లో బోయపాటి సిినిమా హీరోయిజం ఉంటుందని తెలుస్తోంది. ఇక అన్నింటికీ మించి ఈ సినిమాలో కనిపించబోయే ఆర్టిస్టుల లిస్ట్ మాత్రం చాలా ఆసక్తి క్రియేట్ చేస్తోంది. బాలీవుడ్ హీరో వివేక్ ఒబేరాయ్ విలన్‌గా యాక్ట్ చేయబోతున్నాడు. సీనియర్ హీరోయిన్ స్నేహ, స్నేహ భర్త ఈ సినిమాలో చరణ్‌కి తల్లిదండ్రులుగా కానీ పెంచిన పేరెంట్స్‌గా కానీ కనిపించబోతున్నారట. వీళ్ళతో పాటు టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ చంద్ర చరణ్‌కి బావగా కనిపిస్తాడు. నవీవ్ చంద్రకు జోడీగా హీరోయిన్ అనన్య నటించనుంది. అనన్య-చరణ్‌లు అక్కా తమ్ముళ్ళుగా కనిపిస్తారు. మొత్తానికి సినిమాలో కనిపించబోయే నటీనటుల లిస్టుతోనే సినిమాపై చాలా ఆసక్తి క్రియేట్ చేశాడు బోయపాటి. విమర్శకుల విషయం ఎలా ఉన్నా…..కొత్తదనం ఆశించే ప్రేక్షకులు తీసిపడేసినా సరైనోడు సినిమా కలెక్షన్స్ పరంగా సూపర్ హిట్ అన్నది నిజం. ఇప్పుడు చరణ్‌ సినిమాకు కూడా అలాంటి విమర్శలే వస్తాయనడంలో సందేహం లేదు. అయినప్పటికీ రామ్ చరణ్‌కి మరో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడంటే మాత్రం బోయపాటి రేంజ్ నెక్ట్స్ లెవెల్‌కి వెళ్తుందనడంలో సందేహం లేదు. ఆ వెంటనే మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ కూడా వస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -