Sunday, May 12, 2024
- Advertisement -

బాబు డైరెక్షన్‌లో టిడిపి ఎంపిల డ్రామా అదిరింది… కాంగ్రెస్ కూడా మోడీని విమర్శించకుండా చేశారుగా

- Advertisement -

ఆశ్ఛర్యం ఏమీ లేదు. పచ్చ మీడియాలో చంద్రబాబును హీరోగా చూపించడం కోసం ఎన్ని రకాల యాక్టింగులు చేయాలో అన్నీ చేస్తున్నారు టిడిపి ఎంపిలు. సినిమా అంతా కూడా చంద్రబాబు డైరెక్షన్‌లోనే జరుగుతోందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చివరి బడ్జెట్‌లో కూడా అన్యాయం చేసిన మోడీని పల్లెత్తు మాట అనే ధైర్యంలేని టిడిపి ఎంపీలు కాంగ్రెస్‌పై మాత్రం విరుచుకుపడ్డారు. బాబు భజన సేనుడు పవన్ కళ్యాణ్‌తో ఆడిస్తున్న డ్రామా తరహాలోనే పార్లమెంట్‌లో ఎంపిల చేత డ్రామా ఆడించాడు చంద్రబాబు. పవన్ కళ్యాణ్ కూడా నాలుగేళ్ళుగా అన్యాయం చేస్తున్న, ఎన్నికల హామీల విషయంలో మోసం చేసిన, ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కుపోయి రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెడుతున్న చంద్రబాబును వదిలేసి ఎప్పుడో చనిపోయిన వైఎస్‌ని, ప్రతిపక్షంలో ఉన్న జగన్‌ని విమర్శించడానికి తాపత్రయపడుతూ ఉంటాడు కదా. పార్లమెంట్‌లో టిడిపి ఎంపిలు కూడా అదే చేశారు. మోడీని, బిజెపిని విమర్శించింది ఏమీ లేదు కానీ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీని మాత్రం విమర్శించారు. ఇక బడ్జెట్‌ని విమర్శిస్తూ ప్రసంగించాలనుకున్న కాంగ్రెస్ నేతలకు మాత్రం బడ్జెట్‌ని విమర్శించే అవకాశం ఇవ్వకుండా డ్రామాను రక్తికట్టించారు టిడిపి ఎంపిలు. ఈ డ్రామా అంతా చూస్తున్న సోనియా గాంధీ…. నిరసనలు మోడీకి తెలపండి, మోడీ ముందు ఆందోళన చేయండి అని చెప్పడంతో టిడిపి నేతలు రెచ్చిపోయారు. విభజననాడు బిజెపితో కలిసి కాంగ్రెస్ కూడా పాపం చేసింది. అందులో సందేహం లేదు. కానీ ఇప్పుడు మోడీకి వ్యతిరేకంగా ఫైట్ చేస్తే మద్దతివ్వడానికి కాంగ్రెస్ కూడా రెడీగా ఉంది. అదే విషయాన్ని సోనియా కూడా చెప్పింది. కానీ టిడిపి నేతలు మాత్రం సోనియాపై ఎపి ప్రజలకు ఉన్న కోపాన్ని క్యాష్ చేసుకోవడానికి సోనియాపై విరుచుకుపడిపోయారు. మొత్తంగా మోడీ బడ్జెట్‌ని విమర్శించే అవకాశం కాంగ్రెస్‌కి ఇవ్వకుండా గొప్పగా డ్రామా రక్తికట్టించారు. ఈ డ్రామా మొత్తాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ కోసం టిడిపి ఎంపిలు చేసిన అద్భుత, అసమాన పోరాటంగా పచ్చ మీడియా భలే కవర్ చేసింది.

ఇక అన్నింటికీ మించిన ట్విస్ట్ ఏంటంటే మోడీ బడ్జెట్‌పై ఎపిలో ఉన్నప్పుడు విమర్శలు చేసిన టిడిపి ఎంపి టీజీ వెంకటేష్……రాజ్యసభలో తనకు అవకాశం వచ్చినప్పుడు మాత్రం మోడీ బడ్జెట్ అద్భుతంగా ఉంది……ఆహా అనిపించేలా ఉంది అని ప్రశంశల వర్షం కురిపించడం.

వహ్వా అనిపిస్తోంది కదా…రాష్ట్ర విభజన సమయంలోకూడా సేం డ్రామానే. విభజన బిల్లుకు అనుకూలంగా మొదటి ఓటు వేసింది టిడిపి. విభజన చేస్తారా చెయ్యరా అని సోనియాను డిమాండ్ చేసింది చంద్రబాబు, బిజెపిలు. విభజనలో బిజెపిది కూడా సమాన పాపం. కానీ పచ్చ మీడియా మొత్తం కూడా సీమాంద్ర ప్రయోజనాల కోసం పోరాడిన వ్యక్తులుగా చంద్రబాబు, వెంకయ్యలను చూపించి 2014ఎన్నికల్లో టిడిపి, బిజెపిలకు సీమాంధ్రులు ఓట్లేసేలాగా చేసింది. ఇక ఆ తర్వాత నుంచీ హోదాతో సహా అన్ని హామీలను తుంగలో తొక్కారు. ఇప్పుడు మళ్ళీ వైకాపాను, జగన్‌ని విలన్స్‌గా చూపిస్తూ పచ్చ బ్యాచ్ మొత్తం అదే డ్రామా మొదలెట్టింది. 2019లో కూడా పచ్చ డ్రామాలకు ఓట్లు రాల్తాయా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -