Sunday, May 5, 2024
- Advertisement -

బోయ‌పాటి, చరణ్ ప్రేమ్ ర‌త‌న్ ధ‌న్‌పాయో రీమేక్

- Advertisement -

రామ్‌చరణ్ రంగస్థ‌లం త‌ర్వాత బోయపాటి శ్రీనివాస్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌డానికి ఒప్పుకున్నాడు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా జ‌రుగుతోంది. తొలి షెడ్యూల్‌ను రాజస్థాన్‌లో తెరకెక్కించనున్నారు. అయితే ఈ సినిమా రీమేక్ అంట‌. 2015లో వచ్చిన ‘ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో’కి రీమేక్‌గా తెరకెక్కించనున్నట్లు సమాచారం. సల్మాన్‌ ఖాన్‌, సోనమ్‌ కపూర్‌ జంటగా నటించిన ఈ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్‌గా నిలిచింది. స‌ల్మాన్ కెరీర్‌లో బెస్ట్ మూవీ ఇది. 

ఈ విజ‌య‌వంత‌మైన సినిమాను బోయపాటి తీస్తున్నార‌ని టాక్ న‌డుస్తోంది. రామ్‌చరణ్‌ సల్మాన్‌ఖాన్ పోషించిన పాత్రలో కనిపించ‌నున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన వివ‌రాలు ఇంకా బ‌య‌ట‌కు రాలేదు. త్వ‌ర‌లోనే తెలిసే అవ‌కాశం ఉంది.

మైత్రి మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మాణంలో సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న‌‘రంగస్థలం’ సినిమాలో రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్నాడు. స‌మంత హీరోయిన్‌. ఈ సినిమా మార్చిలో విడుద‌లయ్యే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం సైరా సినిమా ప‌నుల‌తో కూడా చెర్రీ బిజీగా ఉన్నాడు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -