Friday, May 17, 2024
- Advertisement -

అడ‌వి రాముడిగా రానా

- Advertisement -

న‌టుడిగా రానా ప‌రిశ్ర‌మ‌లో పాతుకుపోయాడు. వెబ్ సిరీస్‌లు, వ‌రుస సినిమాల‌తో బిజీగా మారిపోయాడు. ప్రస్తుతం 1945 సినిమాలో చేస్తున్న రానా మ‌రో సినిమాకు ప‌చ్చ‌జెండా ఊపాడు. హాథీ మేరి సాథీ సినిమా 1971లో రాజేశ్‌ ఖన్నా హీరోగా బాలీవు్‌డ్‌లో వ‌చ్చి సూప‌ర్‌హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఆ సినిమాను హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందించేలా ప్లాన్ చేస్తున్నారు. రానా పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ లోగోను విడుద‌ల చేశారు.

అయితే ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను న్యూ ఇయర్ కానుక 2018 జనవరి 1వ తేదీన విడుద‌ల చేయ‌నున్నారు. అయితే ఈ సినిమాకు తెలుగులో అడవిరాముడు అనే పేరును ఫిక్స్ చేశారంట‌. ఈ పేరును సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రిజిస్టర్ చేయించారని తెలుస్తోంది. హాథీ మేరీ సాథీ సినిమా తెలుగులో మ‌రోసారి అడ‌వి రాముడిగా రాబోతోంది. ఇప్ప‌టికే అడ‌విరాముడుగా న‌ట‌సార్వ భౌముడు నంద‌మూరి తార‌క రామారావు పోషించి అల‌రించాడు. ఆ త‌ర్వాత ప్ర‌భాస్ కూడా అడ‌వి రాముడిగా ఆర్తి అగ‌ర్వాల్‌తో ఆడిపాడారు. ఇప్పుడు రానా కూడా ఆ టైటిల్‌తో వ‌స్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -