Tuesday, May 21, 2024
- Advertisement -

చెర్రీ, ప్రభాస్ చేస్తోంది వ్యాపారామా… సహకారమా

- Advertisement -

ఆ నలుగురు చేతిలోనే థియేటర్లు ఉండిపోవడంతో ఎవరికి ఏం చేయాలో తెలియని పరిస్థితి. అందుకే థియేటర్లు ఆ నలుగురి చేతుల్లోనే కాకుండా మిగతా వారి చేతులోకి కూడా పోవాలనేది చాలామంది భావన. అప్పుడే చిన్ని సినిమాలకు న్యాయం జరుగుతుందని చాలామంది భావిస్తున్నారు. రీసెంట్ గా దానికి తగ్గట్లుగానే కొందరు కొన్ని రకాల ప్రయత్నాలు షురూ చేశారు. ఎవరు ఎలా చేశారో తెలియదు గాని ప్రభాస్ ,చెర్రీలు మాత్రం ఈవిషయంలో కాస్త గట్టిగానే పావులు కదుపుతున్నట్లు స్పష్టమవుతుంది.

ప్రభాస్- రామ్‌చరణ్‌లు కలిసి కొత్త బిజినెస్ ప్లాన్ చేస్తున్నారు. వీళ్లిద్దరు కలిసి మన రెండు తెలుగు రాష్ర్టాల్లో కొన్ని థియేటర్స్ ను లీజ్‌కి తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇటు ప్రభాస్ (యూవీ క్రియేషన్స్), అటు చెర్రీ ఈ రంగంలోకి దిగుతున్నారన్న సమాచారం తెలియడంతో చిన్న చిత్రాల ప్రొడ్యూసర్లు కాస్త ఊపిరిపీల్చుకున్నారు. అన్నట్లు చెర్రీ నటిస్తున్న ‘రంగస్థలం’ నైజాం రైట్స్‌ని సొంతం చేసుకున్న యూవీ క్రియేషన్స్, తొలిసారిగా డిస్ర్టిబ్యూషన్ రంగంలోకి ఎంట్రీ ఇస్తోంది.చెర్రీ సైతం గీతా ఆర్ట్స్ పైనే ఆధారపడకుండా తనకంటూ థియేటర్లు ఉండాలని భావిస్తున్నాడట. అందుకే తన ఊరోడైనా ప్రభాస్ తో టై అప్ అయినాడు.

ప్రభాస్ యువిక్రియేషన్స్ తో వరుసబెట్టి సక్సెస్ ఫుల్ చిత్రాలు నిర్మిస్తూ వస్తున్నాడు.జిల్ తప్ప ఒక్క ఫ్లాప్ కూడా అతనికి దక్కలేదు. అలాగే కథల ఎంపికలో మంచి సాలిడ్ గా ఉంటున్నాడు. ఏడాదికి రెండునుంచి మూడు చిత్రాలు తానే ఎలాగూ తీస్తాడు కాబట్టి థియేటర్లు కోపం తానెందుకు వెయిట్ చేయాలనే ధోరణిలో ప్రభాస్ ఉన్నట్లు స్పష్టమవుతుంది. అందుకే ఈ థియేటర్ల పాలసీని బయటకు తీసుకువచ్చాడు.ఆ మధ్య కృష్ణంరాజు సైతం రామోజి కలిసి మినిమమ్ సీటింగ్ అనగా జస్ట్ 3౦౦ మంది కూర్చుని చూసే థియేటర్లను బస్ స్టాండ్ లలో నిర్మించాలనుందని చెప్పాడు.అది కార్యరూపం దాల్చబోతుందని ఆశ పడ్డాడు.అది ఎక్కడా ఓ మెట్టు కూడా ఎక్కలేదు. కాని యలమంచిలి రత్నం అనే అతను వై స్క్రీన్ పేరుతో రామోజి,కృష్ణంరాజు ఆశపడ్డ కాన్సెప్ట్ ను ఇంప్లిమెంట్ చేసి ఆంధ్ర ప్రదేశ్ లో సక్సెస్ చేసిపారేశాడు.విజయవాడలో బస్ట స్టాండ్ లో మనకు వై స్క్రీన్ థియేటర్ కాన్సెప్ట్ కనిపిస్తుంది. సో చెర్రీ,ప్రభాస్ లిద్దరూ ఆ తరహా కాన్సెప్ట్ దిశగా కూడా అడుగులు వేస్తే మంచి ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు.ఎందరో చిన్న నిర్మాతలకు సహకారం అందించనూ వచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -