ఏపీలో పోలింగ్ రోజు, ఆ తర్వాత హింసాత్మక ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకోగా 13 మందితో సిట్ ఏర్పాటు చేసింది. ఐజీపీ వినీత్ బ్రిజ్ లాల్ ఆధ్వర్యంలో సిట్ పని చేయనుండగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సిట్ ఏర్పాటు చేశారు డీజీపీ హరీశ్ గుప్తా.
సిట్‌లో సభ్యులుగా ఏసీబీ ఎస్పీ రమాదేవి, ఏసీబీ అడిషనల్ ఎస్పీ సౌమ్యలత, ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి, సీఐడీ డీఎస్పీ పి.శ్రీనివాసులు, ఏసీబీ డీఎస్పీ (ఒంగోలు) వల్లూరి శ్రీనివాస రావు, ఏసీబీ డీఎస్పీ (తిరుపతి) రవి మనోహర చారి, గుంటూరు రేంజ్ ఇన్ స్పెక్టర్ వి.భూషణం, విశాఖ ఇంటెలిజెన్స్ ఇన్ స్పెక్టర్ కే.వెంకటరావు, ఏసీబీ ఇన్ స్పెక్టర్ రామకృష్ణ, ఏసీబీ ఇన్ స్పెక్టర్ జీఐ. శ్రీనివాస్, ఒంగోలు పీటీసీ మోయిన్, అనంతపురం ఏసీబీ ప్రభాకర్, ఏసీబీ ఇన్ స్పెక్టర్ శివ ప్రసాద్ ఉన్నారు.
ప్రధానంగా అల్లర్లు జరిగిన పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ విచారణ చేయనుంది. ఇప్పటికే నమోదైన కేసుల్లో అవసరమైన చోట్ల అదనపు సెక్షన్లు పెట్టడానికి తగిన ప్రతిపాదనలు చేయనుంది.
