Tuesday, May 21, 2024
- Advertisement -

చెర్రీ డాక్టర్ కావాలి అంటే ఏడాది ఆగాలి!

- Advertisement -

రామ్ చరణ్ తన కెరీర్ లో ఇప్పటివకూ డాక్టర్ గా కనిపించలేదు. సరదాగా రచ్చ చిత్రంలో …చిరంజీవిని అనుకరిస్తూ చేసిన స్టెప్ కు ఓ రేంజిలో రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు రామ్ చరణ్ ..పూర్తి స్దాయిలో డాక్టర్ గా కనిపించనున్నట్లు సమాచారం. అంటే సురేంద్రరెడ్డి దర్శకత్వంలో అనుకుంటున్నారా..అయితే అదేమి లేదు… ఆయన త్వరలో సుకుమార్ కోసం చేయబోతున్న చిత్రం కోసం అని తెలుస్తోంది.

ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం…రామ్ చరణ్ కోసం ఓ ఇంట్రస్టింగ్ క్యారక్టర్ ని డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఓ టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ‘ఫార్ములా ఎక్స్’ పేరుతో ఈ సినిమా రాబోతోందని అంటున్నారు. టైటిల్ చూసిన వారంతా ఇది సైన్స్ ఫిక్షన్ సినిమా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. సుకుమార్ అంటేనే…రోటీన్ సినిమాలకు భిన్నంగా ఆలోచించే దర్శకుడు. కెరీర్లో ఇప్పటి వరకు చాలా ప్రయోగాలు చేసిన సుకుమార్ ఈ సారి చెర్రీ మీద ‘ఫార్ములా ఎక్స్’ప్రయోగం చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.

ఈ సినిమాకు సంగీతం కూడా దేవిశ్రీ ప్రసాద్ అందిస్తాడని తెలుస్తోంది. ఈ మధ్య రామ్ చరణ్ రొటీన్ కమర్షియల్ సినిమాలు చేసి బోల్తా పడుతున్నారు. అందుకే ఈసారి తెగింపు నిర్ణయం తీసుకున్నాడని, సుకుమార్ తో ప్రయోగాత్మక చిత్రం చేస్తున్నాడని అంటున్నారు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ధృవ సినిమాతో చెర్రీ బిజీగా ఉండగా, సుకుమార్ తన సినిమాకు ప్రీప్రొడక్షన్, స్క్రిప్ట్ పనులు పూర్తిచేస్తున్నాడట. ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థే ఈ సినిమాను నిర్మిస్తారని సమాచారం. ఈ ఏడాది ఆగస్టు లేదా, సుప్టెంబర్లో సినిమా ప్రారంభం అవుతుందని టాక్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -