Thursday, May 9, 2024
- Advertisement -

గరం మీదున్న తెలంగాణ సర్కార్

- Advertisement -

నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ సర్కార్ కాకమీదుంది. తెలుగు రాష్ట్రాల్లో నీటి ప్రాజెక్టులు ముఖ్యంగా క్రష్ణా నీటి పారుదల ప్రాజెక్టుపై వాటర్ బోర్టు వ్యవహరిస్తున్న తీరుపై తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా క్రష్ణా బోర్డు సభ్య కార్యదర్శిఆర్కే గుప్తా వ్యవహారశైలిపై తెలంగాణ అధికారులు, మంత్రులు మండిపడుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లోని నీటి ప్రాజెక్టులన్నీ తమ పరిధిలోకే తీసుకురావాలని, అక్కడ ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు నీటి వాటాల వంటివి సైతం తామే చేస్తామంటూ కార్యదర్శి ఆర్కే గుప్తా కేంద్రానికి రాసిన లేఖపై తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు తీవ్రస్ధాయిలో మండిపడుతున్నారు. కార్యదర్శిగా ఉన్న గుప్తా ఎటువంటి అవసరం లేకపోయినా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇవ్వడాన్ని మంత్రి హరీష్ రావు తప్పు పడుతున్నారు. ఈ అంశంపై కేంద్ర మంత్రి ఉమా భారతిని కలిసి వాస్తవాలు తెలియజేయాలని నిర్ణయించారు.

ఈ మేరకు మంత్రి హరీష్ రావు కొందరు అధికారులతో కలిసి సోమవారం నాడు ఢిల్లీ వెళ్లి మంత్రిని కలువనున్నారు. మరోవైపు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఆంధ్రప్రదేశ్ సర్కార్ పై ధ్వజమెత్తారు. కేంద్రం ప్రభుత్వం అండ చూసుకుని ఎపి ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మొత్తానికి నీరు ఇరు రాష్ట్రాల మధ్య నిప్పు రగిలిస్తోంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -