Sunday, May 19, 2024
- Advertisement -

గ‌డ్డం తీసేసిన రంగ‌స్థలం చిట్టిబాబు

- Advertisement -

తాను న‌టించిన సినిమా షూటింగ్ పూర్త‌యి విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుండ‌డంతో మ‌రో సినిమా కోసం మెగా న‌టుడు రామ్ చ‌ర‌ణ్‌తేజ్ ఆ పాత్ర నుంచి బ‌య‌ట‌కు వ‌స్తున్నాడు. త‌న త‌ర్వాతి సినిమా కోసం లుక్‌ను మార్చేశాడు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందించిన ‘రంగ‌స్థలం’ సినిమా ఇటీవ‌ల ఐట‌మ్ సాంగ్‌తో షూటింగ్‌కు ప్యాక‌ప్ చెప్పేశారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కొన‌సాగుతున్నాయి. వేస‌విలో సినిమా విడుద‌ల చేయ‌డానికి చూస్తున్నారు.

‘రంగ‌స్థలం’ కోసం రామ్‌చరణ్ సరికొత్త లుక్‌లో క‌నిపిస్తున్నాడు. పల్లెటూరి అబ్బాయిలా గెడ్డం పెంచుకొని లుంగీ క‌ట్టుకొని ఉన్నాడు. ఆ సినిమాలో చిట్టిబాబు పాత్ర కోసం ఆ విధంగా మారిన రామ్‌చ‌ర‌ణ్ ఇప్పుడు బోయపాటి శ్రీనివాస్ సినిమాలో న‌టించేందుకు స‌మాయ‌త్త‌మ‌వుతున్నాడు. ఈ నెల 16 నుంచే దర్శకుడు మొదటి షెడ్యూల్ ని స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడట. అయితే బోయపాటి కథలో మాస్ పాత్ర కోసం చరణ్ ముంబై హెయిర్ స్పెషలిస్ట్‌లతో లుక్‌ను ప్ర‌య‌త్నిస్తున్నాడు. సరికొత్త లుక్ కోసం వారితో చర్చలు చేస్తున్నాడు. వ‌రుస షూటింగ్‌లతో బిజీగా ఉన్న చెర్రీ వారం గ్యాప్ తీసుకొని సినిమా షూటింగ్‌లో పాల్గొన‌నున్నాడు. ఈ సినిమాపై కూడా చెర్రీ బాగా ఆస‌క్తి పెట్టుకున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -