Sunday, May 5, 2024
- Advertisement -

ధావ‌న్, కోహ్లీ క‌ష్ట‌ప‌డినా భార‌త్ ప‌రాజ‌యం

- Advertisement -

దక్షిణాఫ్రికాతో మూడు వ‌న్డేల్లో అద్భుత విజ‌యాలు అందుకున్న భార‌త్ నాల్గో వన్డేలో భారత్ బోల్తా కొట్టింది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్ క‌ష్ట‌ప‌డినా ఓట‌మి పొందింది. శ‌నివారం వాండ‌ర‌ర్స్ మైదానంలో జ‌రిగిన మ్యాచ్‌లో కొన్ని అంత‌రాయాల‌తో మొద‌లైన ఆట మొద‌ట బ్యాటింగ్‌కు భార‌త్ దిగింది. అరుదైన రికార్డు నెలకొల్పాడు. తన కెరీర్‌లో వందో వన్డే మ్యాచ్‌ ఆడుతున్న ధావన్‌ సెంచరీతో చెలరేగాడు. ఫలితంగా వందో వన్డేలో సెంచరీ సాధించిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డు సాధించాడు. సఫారీలతో నాల్గో వన్డేలో 99 బంతుల్లో శతకం సాధించిన తర్వాత కొత్త అధ్యాయాన్ని లిఖించాడు.

వందో వన్డేలో మూడంకెల వ్యక్తిగత స్కోరును నమోదు చేసిన ఓవరాల్‌ క్రికెటర్లలో ధావన్‌ తొమ్మిదో స్థానంలో నిలిచాడు. అంతకుముందు గ్రీనిడ్జ్‌, కెయిన్స్‌, మొహ్మద్‌ యూసఫ్‌, క్రిస్‌ గేల్‌, సంగక్కరా, ట్రెస్కోథిక్‌, శర్వాన్‌, వార్నర్‌లు వందో వన్డేలో శతకం సాధించారు.

స్కోర్ వివ‌రాలు

భారత్‌: రోహిత్‌ (సి అండ్‌ బి) రబాడ 5, ధవన్‌ (సి) డివిల్లీర్స్‌ (బి) మోర్కెల్‌ 109, కోహ్లీ (సి) మిల్లర్‌ (బి) మోరిస్‌ 75, రహానె (సి) రబాడ (బి) ఎన్‌గిడి 8, శ్రేయాస్‌ (సి) మోరిస్‌ (బి) ఎన్‌గిడి 18, ధోనీ (నాటౌట్‌) 42, హార్దిక్‌ (సి) మార్‌క్రమ్‌ (బి) రబాడ 9, భువనేశ్వర్‌ (రనౌట్‌) 5, కుల్దీప్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 18; మొత్తం: 50 ఓవర్లలో 289/7;
వికెట్ల పతనం: 1-20, 2-178, 3-206, 4-210, 5-247, 6-262, 7-282;
బౌలింగ్‌: మోర్కెల్‌ 10-0-55-1, రబాడ 10-0-58-2, ఎన్‌గిడి 10-0-52-2, మోరిస్‌ 10-0-60-1, పెహ్లుక్వాయో 6-0-38-0, డుమిని 4-0-20-0.

దక్షిణాఫ్రికా: మార్‌క్రమ్‌ (ఎల్బీ) బుమ్రా 22; ఆమ్లా (సి) భువనేశ్వర్‌ (బి) కుల్దీప్‌ 33; డుమిని (ఎల్బీ) కుల్దీప్‌ 10; డివిల్లీర్స్‌ (సి) రోహిత్‌ (బి) పాండ్యా 26; మిల్లర్‌ (ఎల్బీ) చాహల్‌ 39; క్లాసెన్‌ నాటౌట్‌ 43; పెహ్లుక్వాయో నాటౌట్‌ 23; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం: 25.3 ఓవర్లలో 5 వికెట్లకు 207.
వికెట్ల పతనం: 1-43, 2-67, 3-77, 4-102, 5-174.
బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-27-0; బుమ్రా 5-0-21-1; కుల్దీప్‌ 6-0-51-2; పాండ్యా 5-0-37-1; చాహల్‌ 5.3-0-68-1.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -