Tuesday, May 21, 2024
- Advertisement -

ధృవ రికార్డులు షురూ

- Advertisement -

రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ ధృవ.. ఈ దసరాకే థియేటర్లలో రికార్డుల అంతు చూడాల్సింది కానీ.. షూటింగ్ పార్ట్ ఇంకా పెండింగ్ ఉండడంతో.. ఇప్పటికి టీజర్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సరిగ్గా విజయదశమి రోజు సాయంత్రం టీజర్ ను రిలీజ్ చేసింది ధృవ యూనిట్. అసలే స్టైలిష్ కాప్ డ్రామా. దీనికి తోడు సురేందర్ రెడ్డి లాంటి స్టైలిష్ డైరెక్టర్ కావడంతో.. టీజర్ చూస్తున్న ఫ్యాన్స్ అరుపులు కేకలే.

ధృవ టీజర్ ఫ్యాన్స్ కి ఎంతగా నచ్చేసిందంటే.. రిలీజ్ అయిన 17 గంటల్లోనే ఈ టీజర్ మిలియన్ వ్యూస్ దాటేసి రికార్డ్ సృష్టించేంసింది. ఇప్పటికే 24వేల లైక్స్ కూడా వచ్చేశాయి. చెర్రీ క్రేజ్ ముందు ఈ కౌంట్ తక్కువే కానీ.. కంప్లీట్ హాలిడే కం ఫెస్టివల్ మూడ్ లో జనాలు ఉన్నపుడు రిలీజ్ అయిన 24 గంటల్లోపే రికార్డులపై కన్నేయడం అంటే మాత్రం చిన్న విషయం కాదు. 

ఇక ధృవ రికార్డుల మోత టీజర్ తో మొదలైందని.. డిసెంబర్ లో సినిమా థియేటర్లలోకి వచ్చాక మెగా పవర్ స్టార్ అసలు హంగామా మొదలవుతుందని.. మెగా ఫ్యాన్స్ ఇప్పటికే ధీమాగా చెప్పేసుకుంటున్నారు. టీజర్ లుక్ చూస్తుంటే.. చెర్రీ ఈ సారి మాంచి కమాండింగ్ హిట్ కొట్టేట్టే ఉన్నాడు. 

{youtube}KkdRGomCHi8{/youtube}

Related

  1. హీరో రామ్ కి బుద్దొచ్చింది
  2. ముఖ్యమంత్రి ఒక కోతి – రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు
  3. రామ్ చరణ్ తో ప్రభాస్!
  4. రామ్ చరణ్ కి ఇది సాధ్యమా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -