Friday, May 17, 2024
- Advertisement -

కామెడీ సినిమాను ప్రొడ్యూస్ చేయబోతున్న రామ్ చరణ్?!

- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ నిర్మాతగా మారేందుకు ఉత్సాహంతో ఉన్నాడని వేరే చెప్పనక్కర్లేదు. ఇది వరకే ఆ అంశం స్పష్టం అయ్యింది. బాబాయ్ పవన్ కల్యాణ్ ను హీరోగా పెట్టి సినిమాను రూపొందిస్తాడనే వార్తలో చెర్రీ నిర్మాతగా కెరీర్ ప్రారంభం కానుందనే వార్తలు వచ్చాయి.

ఆ తర్వాత చిరంజీవి 150 సినిమాను ప్రొడ్యూస్ చేస్తాడనే వార్తలు వచ్చాయి. అయితే ఆ రెండు ప్రాజెక్టులూ ఎప్పటికి కార్యరూపం దాలుస్తాయో చెప్పలేని పరిస్థతి. మరి ఆ సంగతలా ఉంటే అంతలోపు చిరంజీవి తనయుడు ఒక సినిమాను ప్రొడ్యూస్ చేయనున్నట్టుగా తెలుస్తోంది.

అది ఒక  కామెడీ సినిమా.తమిళంలో హిట్టైన సినిమా. దాని పేరు “49 ఓ”. ప్రముఖ తమిళ కామెడియన్ గౌండమణి ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటించాడు. తమిళంలో ఈ సినిమా సక్సెస్ అనిపించుకుంది. దీంతో ఈ సినిమా రీమేక్ పట్ల చెర్రీ ఉత్సాహం చూపుతున్నట్టుగా తెలుస్తోంది. దీన్ని తెలుగులో రీమేక్ చేయాలనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. మరి మెగా పవర్ స్టార్ ను అంతగా ఆకట్టుకుందంటే.. ఈ సినిమాలో అంత సత్తా ఏముందో.. అనేది ఆసక్తికరమైన అంశం.

మరి దీన్ని తెలుగులో రీమేక్ చేస్తే.. తెలుగులో ఎవరు నటిస్తారనేది కూడా బాగా ఆసక్తికరమైన అంశం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -