Monday, May 20, 2024
- Advertisement -

ముంబ‌య్ గ‌ళ్లీలో  క్రికెట్ ఆడుతున్న స‌చిన్‌….

- Advertisement -

భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ను క్రికెట్‌ నుంచి ఎవరూ దూరం చేయలేరు. కాస్త తీరిక దొరికితే చాలు సచిన్‌ తన చుట్టుపక్కల ఉన్న వారితో క్రికెట్‌ ఆడేందుకే ఆసక్తి చూపిస్తాడు. తాజాగా సచిన్‌ ముంబయిలో రోడ్డుపై క్రికెట్‌ ఆడిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది.

క్రికెట్‌ను అమితంగా ప్రేమించే క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌ క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పినా ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ఐకాన్‌గా వ్యవహరిస్తున్నారు. చాలా మంది యువ క్రికెటర్లకు సచినే మార్గదర్శి. ప్రపంచ క్రికెట్‌లో తన పేరు మీద అనేక రికార్డులు నెలకొల్పిన సచిన్‌, రిటైర్‌మెంట్‌ తర్వాత కుటుంబంతోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు.

ఈ వీడియోను సచిన్‌ చిన్ననాటి స్నేహితుడు వినోద్‌ కాంబ్లి తన ట్విటర్‌ ద్వారా పంచుకున్నాడు. ముంబయిలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతమైన విల్లే పార్లీలోని దయాల్‌దాస్‌ రోడ్డులో సచిన్‌ క్రికెట్‌ ఆడినట్లు తెలుస్తోంది. ఇంతకీ సచిన్‌తో క్రికెట్‌ ఆడింది స్థానిక హోటల్‌ సిబ్బందిగా తెలుస్తోంది. వారు వేసిన బంతుల్ని సచిన్‌ ఎదుర్కొన్నాడు. రాత్రి సమయంలో రోడ్డుపై క్రికెట్‌ ఆడుతున్న సచిన్‌ను అటుగా కారులో వెళ్తున్న ఓ చిన్నారి గుర్తుపట్టి సచిన్‌ సచిన్‌ అని పిలిచింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -