Sunday, May 5, 2024
- Advertisement -

రాజ‌స్థాన్‌లో చెర్రీ యాక్ష‌న్

- Advertisement -

రామ్‌చ‌ర‌ణ్ డ‌బుల్‌యాక్ష‌న్

యాక్ష‌న్ సినిమాల పేరు చెబితే గుర్తుచ్చే ద‌ర్శ‌కుడు బోయాపాటి శ్రీనివాస్‌రెడ్డి. క‌మెడియ‌న్‌తోనైనా యాక్ష‌న్ సీన్స్ అద‌ర‌గొట్టే వ్య‌క్తి బోయ‌పాటి. అత‌డి ద‌ర్శ‌క‌త్వంలో రామ్‌చ‌ర‌ణ్ ఓ సినిమా చేస్తున్నాడు. ప్ర‌స్తుతం ఆ షూటింగ్ శ‌ర‌వేగంగా కొన‌సాగుతోంది. బోయపాటి మార్క్ మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ తో రూపొందుతున్న ఈ సినిమా మేజర్‌ పార్ట్ షూటింగ్ రాజస్థాన్‌లో చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దాదాపు 70 శాతం షూటింగ్ అక్కడే ఉంటుందని తెలుస్తోంది. రాజ‌స్థాన్ ప్రాంతంలోని కోటల్లో షూటింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకునేందుకు చెర్రీ రెడీ అవుతున్నాడు.డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో డీవీవీ దానయ్య ఈ సినిమా నిర్మిస్తున్నాడు. రామ్‌చ‌ర‌ణ్ బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్‌తో ఫైటింగ్ చేయ‌నున్నాడు. అంటే విల‌న్‌గా న‌టించ‌నున్నాడు. ప్రస్తుతం రామ్‌చ‌ర‌ణ్‌ సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం సినిమాలో నటిస్తున్నాడు.

https://www.youtube.com/watch?v=I_Y-6FlkH8I

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -