Friday, May 17, 2024
- Advertisement -

ధోనీ షాకులు చెప్ప‌డు…మ‌రో సారి ప్రశంసించిన‌ కోచ్ రవిశాస్త్రి…

- Advertisement -

భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లిపై పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించారు ప్ర‌ధాన కోచ్ ర‌విశాస్త్రి. ఆట‌లో ఎప్పుడూ సాకులు వెతికేందుకు కోహ్లీ ప్రయత్నించడని.. మైదానంలో 100 శాతం అత్యుత్తమ ప్రదర్శన చేయాలని మాత్రమే పరితపిస్తుంటాడని కితాబిచ్చారు. ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో 11 శతకాలు, మూడు డబుల్ సెంచరీలు బాదిన కోహ్లి మొత్తం 2,812 పరుగులతో భారత్ విజయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాడు.

జనవరి 5 నుంచి దక్షిణాఫ్రికాతో మూడు టెస్టుల సిరీస్‌లో టీమిండియా తలపడనున్న నేపథ్యంలో మీడియాతో రవిశాస్త్రి మాట్లాడారు. కోహ్లి దూకుడు, ఫిటెనెస్ శ్రద్ధ ప్రస్తుతం జట్టు మొత్తం అలవడిందని కోచ్ గుర్తు చేశారు.

విరాట్ కోహ్లి‌కి ఆటపై అంకిత భావం ఎక్కువ. అతను చాలా గొప్ప ఆటగాడు కావాలని కోరుకుంటున్నాడు. అలా ఎదిగిన తర్వాత ఎలాంటి ప్రదర్శన ఇవ్వాలో కూడా అతనికి తెలుసు. దాని కోసం కోహ్లి చాలా త్యాగాలు చేసి ఫిటెనెస్ కాపాడుకుంటున్నాడు. ఓ 29 ఏళ్ల క్రికెటర్‌గా, జట్టు కెప్టెన్‌గా ఇతరులు కలలో ఊహించే విజయాలను సాధించాలని కోహ్లి పరితపిస్తున్నాడు. చాలా మంది అతడ్ని పొగుడుతుంటే.. అతను మాత్రం వాటిని పట్టించుకోకుండా.. మరింత ఉన్నత స్థానానికి ఎదిగేందుకు కష్టపడుతున్నాడు. ఈ క్రమంలో అతని వద్ద సాకులుకి ఛాన్స్ లేదు’ అని రవిశాస్త్రి వివరించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -