Saturday, May 18, 2024
- Advertisement -

ఓబ‌య్య‌గా విజ‌య్‌సేతుప‌తి

- Advertisement -

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి (సైరా)గా మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్నాడు. బ్రిటీష్‌ వాళ్లపై సమర శంఖారావం పూరిస్తున్న విషయం తెలిసిందే. సైరాకు ముఖ్యమైనవాడు, నమ్మినబంటు, తన కుడి భుజంగా ‘ఓబయ్య’ ఉంటాడు. ఆ ఓబ‌య్య పాత్ర‌ను ఈ సినిమాలో ఎవ‌రూ పోశిస్తారోననే ఊహ‌గానాలు వ‌చ్చాయి. అయితే ఈ సినిమాను జాతీయ స్థాయిగా తీయాల‌ని చూస్తుండ‌డంతో ఇత‌ర సినిమా ప్ర‌ముఖులను న‌టించాల‌ని చూస్తున్నార‌ట‌. నరసింహారెడ్డికి ఓబయ్య ముఖ్య‌మైన వ్య‌క్తి. అందుకే ఈ పాత్రపై చిత్ర‌బృందం ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టింది.

అయితే ఈ పాత్ర‌లో తమిళ నటుడు విజయ్‌ సేతుపతి న‌టిస్తార‌ని సమాచారం. కథలో కీలకమైన పాత్ర కావ‌డంతో అత‌డిని ఎంపిక చేశార‌ని వినికిడి.అయితే ఇప్ప‌టికే ఈ సినిమాలో అమితాబ్‌బచ్చన్, నయనతార, సుదీప్‌ వంటి భారీ తారాగణంతో ఈ సినిమాను తీస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో వ‌హిస్తున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్‌పై చిరంజీవి త‌న‌యుడు రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. వచ్చే నెలలో మరో షెడ్యూల్‌ మొదలు కానుంది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -