Thursday, May 9, 2024
- Advertisement -

విన‌య విధేయ రామ ఫ్లాప్‌పై స్పందించిన రామ్ చ‌ర‌ణ్

- Advertisement -

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తాజాగా న‌టించిన చిత్రం విన‌య విధేయ రామ‌. రంగ‌స్థ‌లం వంటి ఇండ‌స్ట్రీ హిట్ త‌రువాత రామ్ చ‌ర‌ణ్ న‌టించిన చిత్రం కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. పైగా ఈ సినిమాకు క‌మర్షియ‌ల్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డంతో సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు మెగా అభిమానులు. సంక్రాంతికి విడుద‌ల అయిన ఈ సినిమా అంద‌రి అంచ‌నాల‌ను త‌లకిందులు చేసింది. క‌థ‌లో కొత్త‌ద‌నం లేక‌పోవ‌డం,బోయ‌పాటి గ‌త సినిమాల‌ను పోలి ఉండ‌టంతో సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా ఫెయిల్ అయింది.

సినిమాలో కొన్ని సీన్స్‌పై ఫ్యాన్స్ సైతం అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఇక ఈ సినిమా నిర్మాత‌కు బాగా నష్టాల‌ను మిగిల్చిన‌ట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా ఫ‌లితం రామ్ చ‌ర‌ణ్ స్పందించిన‌ట్లు స‌మాచారం అందుతోంది. క‌థ విన‌గానే నాకు గ్యాంగ్ లీడ‌ర్ ఫిలింగ్ వ‌చ్చింద‌ని అందుకే ఈ సినిమాను ఒప్పుకున్న‌ట్లు త‌న సన్నిహితులు వ‌ద్ద రామ్ చ‌ర‌ణ్ చెప్పిన‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. బోయ‌పాటిని గుడ్డిగా న‌మ్మి సినిమా చేస్తే అభిమానులు సైతం తిట్టుకునే పరిస్థితి వ‌చ్చింద‌ని రామ్ చ‌ర‌ణ్ వ్యాఖ్య‌నించిన‌ట్లు వినికిడి. ఏది ఏమైన‌ప్ప‌టికి రంగ‌స్థ‌లం వంటి హిట్ త‌రువాత విన‌య విధేయ రామ వంటి ఫ్లాప్‌ను ఫేస్ చేశాడు రామ్ చ‌ర‌ణ్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -