- Advertisement -

‘పెద్ది’లో అదిరిపోయే ఐటమ్ సాంగ్ వ‌చ్చేసింది!

- Advertisement -

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘హల్లోహల్లల్లో’ అంటూ సాగే స్పెషల్ సాంగ్ ఫుల్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. ఈ పాటలో రామ్ చరణ్‌తో కలిసి శృతి హాసన్, జాన్వీ కపూర్ వేసిన స్టెప్పులు ప్రేక్షకులను అలరిస్తున్నాయి.

బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. రెండో ఆదివారం నాటికి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 393 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. త్వరలోనే రూ. 400 కోట్ల మైలురాయిని దాటబోతోంది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన దక్షిణాది చిత్రంగా ‘పెద్ది’ ఇప్పటికే రికార్డు సృష్టించింది.

ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకునేందుకు చిత్రబృందం బుధవారం నుంచి సినిమాలో మరికొన్ని కొత్త సన్నివేశాలను జోడించనుంది. దీనివల్ల రాబోయే రోజుల్లో థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా, శృతి హాసన్ ప్రత్యేక గీతంలో మెరిశారు. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించిన ‘హల్లోహల్లల్లో’ పాటను రక్షిత సురేశ్ పాడారు. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. వృద్ధి సినిమాస్ సంస్థ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద మరిన్ని రికార్డుల దిశగా పయనిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -