అనంతపురం టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. తనకు అన్యాయం జరిగిందంటూ టీడీపీ పార్లమెంటరీ ఆఫీస్ వద్ద మైనారిటీ నేత ఐఎంఎం బాషా బైఠాయించారు. భార్యా పిల్లలతో బైఠాయించారు టీడీపీ నేత ఐఎంఎం బాషా.
టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నమ్మించి మోసం చేశారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు లేదా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఐఎంఎం బాషా కు సర్దిచెప్పేందుకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు యత్నించారు. కానీ బాషా వినిపించుకోలేదు.
గతంలో కూడా టీడీపీ ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని ఉందని బాషా సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తనకు ఏమి జరిగినా టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌దే బాధ్యత … టీడీపీ ని నమ్ముకున్న వారికి పదవులు దక్కటం లేదు ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగుదేశం పార్టీలో అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్నాయి …తనను గెలిపిస్తే మైనార్టీలకు ఇంటి స్థలాలు ఇస్తానన్న హామీలు మరిచిపోయారు అని ఆరోపించారు. తాజాగా టీడీపీ ఆఫీస్ ముందే కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళనకు దిగారు బాషా.
