- Advertisement -

AP SIR:మాజీ డిప్యూటీ సీఎం ఓటు మిస్సింగ్

- Advertisement -

SIRలో ఒక్కటొక్కటిగా బయటప‌డుతున్నాయి విచిత్రాలు. తాజాగా ఏపీలో వైసీపీ నేతల ఓట్లన్ని మిస్ అవుతున్నాయి. తాజాగా మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఓటు 2002 జాబితాలో మిస్ అయింది. తన కుటుంబ సభ్యుల ఓట్లతో సహా అందరి ఓట్లు గల్లంతు అవడం విశేషం.

అంజాద్ బాషా డోర్ నెంబర్ 9-420 నుంచి వరుసగా నాలుగు ఇళ్ల ఓట్లు గల్లంతు అయ్యాయి. దీనిపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు అంజాద్ బాషా. తాను పుట్టినప్పటి నుంచీ అదే ఇంట్లో ఉంటున్నా.. లిస్టులో ఓట్లు ఎలా మాయమవుతాయని ప్రశ్నించారు. వెంటనే జిల్లా కలెక్టర్, ఎన్నికల సంఘం కల్పించుకోవాలని డిమాండ్ చేశారు.

అలాగే మాజీ ఎమ్మెల్యే ర‌ఘురామిరెడ్డి కుటుంబ సభ్యుల ఓట్లు కూడా గల్లంతయ్యాయి. 2019, 2024లో ఓటు వేసిన నా కొడుకు, కోడ‌లు ఓట్లు తొల‌గించారు అని ఆరోపించారు రఘురామిరెడ్డి. మా అబ్బాయి దుష్యంత్ రెడ్డి, అత‌ని భార్య లక్ష్మీ ప్రసన్న.. మొన్న‌టి ఎన్నిక‌ల్లోనూ ఓటు వేశారు.. ‘డిలీటెడ్’ అని స్టాంప్ వేసి ఓట్లు తీసేశారు.. అర్హులైన వారి ఓటు తొలగించే కుట్ర జరుగుతుంది అన్నారు.

నా సొంత గ్రామానికి చెందిన చాలా మంది పేర్లు తొలగించి, కొత్తవారి పేర్లు చేర్చారు.. వైసీపీ సానుభూతిపరుల పేర్లు ఓటర్ లిస్టులో నుంచి తొలగిస్తున్నారు..
2002 ఒరిజినల్ ఓటర్ లిస్ట్ ఇవ్వమని అడిగితే అధికారులు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు..SIRపై వైసీపీ న్యాయపర పోరాటం తప్పక చేస్తుంది అన్నారు మాజీ ఎమ్మెల్యే ర‌ఘురామిరెడ్డి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -