మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ మంచి పని.. ఇప్పుడు మెగా అభిమానుల్లో హాట్ టాపిక్ అయింది. బాలుడి ప్రాణాలు కాపాడిన రామ్ చరణ్.. ఓ పేద కుటుంబంలో సంతోషాన్ని నింపాడు. ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడంలో రామ్ చరణ్ ఎప్పుడు ముందే ఉంటాడి.
{loadmodule mod_custom,GA1}
రామ్ చరణ్ చేసిన మేలును లైఫ్ మొత్తం గుర్తుంచుకుంటాం అంటూ.. ఆ కుటుంబం రీసెంట్ గా రామ్ చరణ్ సుకుమర్ ‘రంగంస్థలం 1985’ సెట్స్ ను సందర్శించి రామ్ చరణ్ కు థాంక్స్ చెప్పారు. మరి రామ్ చరణ్ చేసిన ఆ మంచి పని ఏంటి..? పూర్తి విషయంలోకి వెళ్తే.. రాజమహేంద్రవరం గ్రామానికి చెందిన ధనుష్ అనే మూడేళ్ల బాలుడు మూత్రపిండాల వ్యాధితో బాధ పడుతున్నాడు. ఏప్రిల్ నెలలో రంగస్థలం 1985 షూటింగ్ రాజమహేంద్రవరం పరిసరాల్లో జరిగినపుడు ఈ విషయం రామ్ చరణ్ వరకు వద్దకు వచ్చింది. షూటింగ్ జరుగుతున్న టైంలో ధనుష్ కుటుంబం రామ్ చరణ్‌ను కలిసి తమ గోడును చెప్పారు. దీంతో రామ్ చరణ్ తన సొంత ఖర్చుతో చికిత్సకు ఏర్పాట్లు చేయించారు.
{loadmodule mod_custom,GA2}
రామ్ చరణ్ ఆదేశాలతో హైదరాబాద్‌లో ప్రైవేటు ఆసుపత్రిలో ధనుష్‌కు చికిత్స జరిగింది. ఇపుడు ధనుష్ పూర్తి ఆరోగ్యవంతుడయ్యాడు. ‘రంగస్థలం 1985′ షూటింగ్ మళ్లీ రాజమహేంద్రవరం పరిసరాల్లోనే జరుగుతుండటంతో ధనుష్ కుటుంబం చరణ్‌ను కలిసి.. ఆయన చేసిన మేలుకు.. ధన్యవాదాలు తెలిపారు.
{youtube}Wr2bK_Rot_w{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related