Thursday, May 2, 2024
- Advertisement -

బాహుబలి 2 చూసి రామ్ చరణ్ ఏమన్నాడో తెలుసా..?

- Advertisement -
ram charan comments on baahubali 2

బాహుబలి 2 సినిమా.. ఈ చిత్రం కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూసింది. రీసేంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా అద్భుతమైన హిట్ సాధించింది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్, రానా, అనుష్క అద్భుతమైన నటన కనబర్చారు. ప్రస్తుతం ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

అలానే బాహుబలి 2 పై అభినందనల వర్షం కురుస్తోంది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అని సంబంధం లేకుండా ప్రతిఒక్కరూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబ సభ్యులతో కలిసి ఇటిఅవ్లే బాహుబలి కంక్లూజన్ సినిమాని చూసారు. సినిమా చూసిన అనంతరం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికపై తెలిపారు. “భారతీయ అతిపెద్ద బ్లాక్ బస్టర్ మూవీ బాహుబలి కంక్లూజన్. రాజమౌళి గారి ఊహాత్మక శక్తికి, దానిని వెండితెరపై చూపించే విధానానికి హ్యాట్సాఫ్.

బాహుబలి తెలుగు సినిమా భాష, ప్రాంత పరిధులను చెరిపివేసింది. ఈ మూవీ ఫిలిం మేకర్స్ అందరికీ స్ఫూర్తినిచ్చింది”  అని అన్నారు. ఇక నటీనటుల గురించి మాట్లాడుతూ ” మా డార్లింగ్ ప్రభాస్ పవర్ ఫుల్ లుక్, నటనతో అదరగొట్టాడు.. అలానె నా ప్రేండ్ రానా యువకుడిగా, ముసలివాడిగా ఉత్తమ నటన ప్రదర్శించాడు. అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ గారు, సత్యరాజ్ గారు తమ నటనతో అందరినీ కట్టిపడేసారు” అని చరణ్ అభినందించారు. 

Related

  1. బాహుబలి లో కనించిన ఈ చిన్నారి ఎవరో తెలుసా..?
  2. బాహుబలి విలన్ అల్లు అర్జున్.. నెట్ లో హల్ చల్
  3. జ‌గ‌న్ బాహుబలి అయితే…. లోకేష్ కామెడీ యాక్టర్
  4. బాహుబలి 2 సంచలన రికార్డు.. కేవలం మూడు రోజుల్లో 500 కోట్లు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -