Wednesday, May 15, 2024
- Advertisement -

చిరు, చరణ్ లపై మహేష్ కామెంట్స్

- Advertisement -
mahesh babu about chiranjeevi and ram charan

సూపర్ స్టార్‌ మహేష్‌బాబు రీసెంట్ గా ఓ తమిళ మేగజైన్ కు ఇంటర్య్వూ ఇచ్చాడు. ‘స్పైడర్‌’ సినిమాని తమిళ దర్శకుడు మురుగదాస్‌ తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు కంప్లీట్ కావొచ్చింది. రీసెంట్ గా సినిమా ఫస్ట్‌లుక్‌ మరియు టైటిల్‌ను రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ కు మంచి స్పండన వస్తోంది.

తాజాగా తమిళ మీడియాతో మాట్లాడిన మహేష్‌ చాలా ఆసక్తికర విషయాలు తెలిపాడు. చిరంజీవి, రామ్‌ చరణ్‌ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తరుచుగా మెగా అభిమానులు, సూపర్ స్టార్‌ అభిమానులు కొట్టుకుంటూ ఉంటారు. సోషల్‌ మీడియా వేదికగా అభిమానులకు ఎప్పుడూ తగాదాలు అవుతూనే ఉన్నాయి. ఫ్యాన్స్ మధ్య ఇంత గొడవ జరిగినా కూడా హీరోలు మాత్రం చాలా క్లోజ్ గా ఉంటారు.

మహేష్‌ స్వయంగా చిరంజీవి నాకు బాగా దగ్గరి వ్యక్తి, రామ్‌ చరణ్‌ కూడా బాగా క్లోజ్‌ అంటూ చెర్రీ, మహేష్ ల స్నేహం గురించి చెప్పాడు. అంతేకాకుండా ఇంకా చాలామంది గురించి కూడా ఆసక్తికర సంగతులను చెప్పాడు. రామ్‌ చరణ్‌ ఫ్యామిలీ మరియు మహేష్‌ ఫ్యామిలీ గతంలో ఫారెన్‌ ట్రిప్‌ వేసి ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన విషయం తెల్సిందే.  అంతేకాకుండా మహేష్‌ ‘శ్రీమంతుడు’ సినిమా చూసి కేవలం తనను రామ్‌ చరణ్‌ ఒక్కడు మాత్రమే అభినందించాడు అని మహేష్‌ తెలిపాడు.

Related

  1. మహేష్ బాబుపై సంచలన కామెంట్స్ చేసిన ఎన్టీఆర్
  2. మహేష్, కొరటాల సినిమా టైటిల్ ఇదే!
  3. పవన్ ఫ్యాన్స్ పై మహేష్ ఫ్యాన్స్ రివెంజ్ తీర్చుకున్నారు..?
  4. మహేష్ భార్య రీ ఎంట్రీ.. ఏ సినిమాలో అంటే..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -