Monday, June 17, 2024
- Advertisement -

బాక్సాఫీస్ వ‌ద్ద రంగ‌స్థ‌లం వీరంగం

- Advertisement -

రాంచ‌ర‌ణ్ తాజా చిత్రం రంగ‌స్థ‌లం బాక్సాఫీస్ వ‌ద్ద ప‌రుగులు తీస్తుంది.మార్చి 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం హిట్ టాక్‌తో దూసుకుపోతుంది.ఈ చిత్రం తొలివారంలో ప్రపంచ వ్యాప్తంగా మొత్తం రూ.130 కోట్లు వసూలు చేసినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. కేవలం 7 రోజుల్లో అత్యధిక వసూళ్లు సాధించిన తొమ్మిదో తెలుగు చిత్రంగా నిలిచిందని చెప్పారు.రెండో వారంలో మహేశ్‌బాబు ‘శ్రీమంతుడు’, ఎన్టీఆర్‌ ‘జనతా గ్యారేజ్‌’, ‘జై లవకుశ’, పవన్‌కల్యాణ్‌ ‘అత్తారింటికి దారేది’ సినిమాల వసూళ్లను కూడా అధిగమిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఈ సినిమాలో రాంచ‌ర‌ణ్ న‌ట‌న‌కు అన్నీ వైపుల నుండి ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయ‌.ఈ సినిమాలో చేసిన క్యారెక్ట‌ర్ ఆర్టీస్ట్‌ల‌కు మంచి పేరు వచ్చింది.1985 కాలాన్ని తలపిస్తూ పల్లెటూరి నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా స‌మంత చేసింది.క‌న్‌ఫ్యూజ‌న్ డైర‌క్ట‌ర్‌గా పేరున్న సుకుమార్ ఈ సినిమాతో ఆ అప‌వాదుని పొగొట్టుకున్నాడు.ఈ సినిమా నాన్ బాహుబ‌లి రికార్డుగా నిలిచే అవ‌కాశం ఉంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -