Sunday, April 28, 2024
- Advertisement -

Ram Charan : జపాన్ లో చిట్టిబాబు వీర ప్రతాపం.. అక్కడ ఆ సినిమా రికార్డ్ బద్ధలు కొట్టిన రంగస్థలం..!

- Advertisement -

తెలుగు సినిమాలు ఖండాతరాలు దాటి క్రేజ్ తెచ్చుకోవడం ఈమధ్య మనం చూస్తూనే ఉన్నాం. ఆర్.ఆర్.ఆర్ సినిమాను హాలీవుడ్ వాళ్లే శభాష్ అనేశారు. సినిమాను ఎంత ప్రమోట్ చేసినా అందులో విషయం లేకపోతే మాత్రం అన్ని ప్రశంసలు అందుకోలేదు. ఆర్.ఆర్.ఆర్ తో ఎన్.టి.ఆర్, చరణ్ ఇద్దరు గ్లోబల్ స్టార్స్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. అయితే చరణ్ ఆ క్రేజ్ ని మరింతగా వాడేస్తున్నాడు. ఆర్.ఆర్.ఆర్ సినిమా జపాన్ లో భారీ రేంజ్ లో హిట్ అయ్యింది. సినిమా అక్కడ రికార్డ్ వసూళ్లు రాబట్టింది.

ఆ క్రేజ్ తోనే రాం చరణ్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా రంగస్థలం సినిమా అక్కడ రిలీజ్ చేశారు. ఆర్.ఆర్.ఆర్ క్రేజ్ తో చరణ్ సినిమాని అక్కడ భారీ రిలీజ్ చేయగా యూనానిమస్ గా జపాన్ ఆడియన్స్ రంగస్థలం సినిమాకు సూపర్ గా కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా చిట్టు బాబు పాత్రకు చరణ్ అభినయం అక్కడ ఫ్యాన్స్ కి బీభత్సంగా ఎక్కేసింది. సినిమా రిలీజైన రోజే రికార్డ్ వసూళ్లు రాబట్టింది అంటే చరణ్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

జపాన్ లో ఇండియన్ సినిమా రికార్డులన్ని బ్రేక్ చేసి రాం చరణ్ రంగస్థలం సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. అక్కడ మొదటి రోజే 2.5 మిలియన్ యోన్లు కలెక్ట్ చేసింది రంగస్థలం. సినిమాను 70 స్క్రీన్స్ లో రిలీజ్ చేయగా ఆ స్క్రీన్స్ తోనే ఈ రేంజ్ వసూళ్లు రాబట్టి సెన్సేషన్ సృష్టించింది. ముఖ్యంగా చరణ్ బాక్సాఫీస్ స్టామినా ఏంటన్నది మరోసారి ప్రూవ్ చేసింది. సుకుమార్ డైరెక్షన్ లో చరణ్ చిట్టిబాబుగా నట విశ్వరూపం చూపించాడు. రంగస్థలం తర్వాత చరణ్ నటుడిగా కొత్తగా కనిపించడం మొదలు పెట్టాడు.

ఆర్.ఆర్.ఆర్ లో కూడా రామరాజు పాత్రలో అతను పడిన కష్టం స్క్రీన్ మీద స్పష్టంగా కనిపిస్తుంది. చరణ్ సినిమాకు ఎంత అవుట్ పుట్ ఇస్తున్నాడు అన్నది ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తే అర్ధమవుతుంది. రంగస్థలం జపాన్ లో సూపర్ హిట్ అవడం మెగా ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది. గ్లోబల్ స్టార్ గా చరణ్ తన క్రేజ్ ని రోజు రోజుకి డబుల్ చేసుకుంటున్నాడని ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉన్నారు. ఇక చరణ్ నెక్స్ట్ సినిమా శంకర్ డైరెక్షన్ లో వస్తుంది. ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -