Friday, March 29, 2024
- Advertisement -

చెర్రీ వీకెండ్ ఏం చేశాడో చూశారా

- Advertisement -

రామ్ చరణ్ కు పెట్స్ అంటే చాలా ఇష్టం.అయితే అమల మాదిరిగా మనోడు పెట్స్ పై తనకున్న మమకారాన్ని ఓపెన్ గా చెప్పుకోడు. ఇదొక్కటే కాదు ఆల్మోస్ట్ అన్ని విషయాల్లోను చెర్రీ లో ప్రొఫైల్ మెయిన్ టైన్ చేస్తాడు. అదే చరణ్ బాబును సోషల్ మీడియాలో హీరోను చేయలేకపోయింది.కాని మనోడు చేసే కొన్ని జాలి రైడింగ్ దృశ్యాలు ఎంత దాచినా దాగవు కదా. తాజాగా చెర్రీలోని జాలి రైడ్ వీడియో ఒకటి ఫేస్ బుక్ ఖాతాలో ప్రత్యక్షమైంది.అది కూడా ఉపాసన ఖాతాలో దర్శనమీయడం విశేషం.

తన భర్త తనని తాను ఎలాగూ ప్రమోట్ చేసుకోడు…తానైనా ప్రమోట్ చేద్దామని ఉపాసన రంగంలోకి దిగింది. రాం చరణ్ గతంలో మగధీర సినిమాలో స్వారీ చేసిన గుర్రాన్ని,దానిపై ఎక్కి కూచున్న చెర్రీని ఉపాసన తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది.. ” మిస్టర్ సి (చెర్రీ) వీకెండ్ ను తన పాత స్నేహితుడు మగధీర గుర్రంతో స్పెండ్ చేస్తున్నాడు ” అంటూ క్యాప్షన్ పెట్టింది . బాద్షా పేరున్న ఈ గుర్రాన్ని చెర్రీ ఎంతగానో అభిమానిస్తాడు. సో వీకెండ్ మనోడు ఇలా తన సరదాను తీసుకున్నాడన్నమాట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -