Sunday, May 26, 2024
- Advertisement -

క్రికెట‌ర్లు ఇక‌నుంచి….బిజినెస్ క్లాస్‌లో ప్ర‌యాణం..

- Advertisement -

భార‌త క్రికెట‌ర్ల‌కు బీసీసీఐ తీపిక‌బుడు అందించింది. ఇక నుంచి స్వ‌దేశంలో కూడా ఆట‌గాళ్లంద‌రు బిజినెస్‌క్లాస్‌లో ప్ర‌యానించ‌వ‌చ్చు. ఈ మేరకు ఆమోద ముద్ర వేసినట్లు బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షడు సీకే నేతృత్వంలోని సీఓఏ కమిటీ స్పష్టం చేసింది.

ఇప్ప‌టి వ‌ర‌కు స్వదేశంలో జ‌రిగె సిరీస్‌ల్లో భాగంగా సాధార‌ణ ఎకాన‌మీ క్లాస్‌లో ప్ర‌యానిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితె స్వదేశంలో మ్యాచ్ లు జరిగే సమయంలో విమానంలో ప్రయాణించేటప్పుడు తాము అసౌకర్యానికి గురువుతున్నట్లు క్రికెటర్లు ఫిర్యాదు చేశారు. ఎకానమీ క్లాస్ లో ప్రయాణించడం వల్ల చాలా మంది తోటి ప్రయాణికులు సెల్పీల కోసం ఇబ్బంది పెడుతున్నారని క్రికెటర్లు పేర్కొన్నారు. అంతేకాకుండా కాళ్లు పెట్టుకోవడానికి కూడా స్పేస్ కూడా తక్కువగా ఉంటుందని బీసీసీఐకి ఫిర్యాదులో తెలిపారు.

దీంతో విదేశాల్లో ప‌ర్య‌టించేట‌ప్పుడు స‌మ‌కూర్చే బిజినెస్ క్లాస్ ప్ర‌యాణాన్ని స్వదేశంలో కూడా క‌ల్పించాల‌ని బీసీసీఐ నిర్ణ‌యించింది. దీనికి ఇటీవల జరిగిన సీఓఏ సమావేశంలో ఆమోదం తెలిపినట్లు సీకే ఖన్నా తెలిపారు. వాస్తవానికి విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు మాత్రమే టీమిండియా సభ్యులకు బిజినెస్ క్లాస్ టిక్కెట్లు బుక్ చేస్తున్నారు. స్వదేశంలో ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించాల్సి ఉంది. అయితే కెప్టెన్, కోచ్ మాత్రం స్వదేశంలోనూ బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించొచ్చు. ఇప్ప‌టినుంచి క్రికెట‌ర్లంద‌రూ స్వ‌దేశంలో బిజినెస్ క్లాస్‌లో ప్ర‌యానించ‌వ‌చ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -