- Advertisement -

చంద్రబాబు ఇలా కెసిఆర్ అలా .. ఇలా అయితే ఎలా ?

- Advertisement -

రైతుల ఆత్మహత్యల ఉదంతం దేశాన్ని కుదిపేస్తోంది, కాంగ్రెస్ హయాం లోనే అనుకుంటే బీజేపీ కేంద్రం లో పీఠం ఎక్కిన తరవాత కూడా ఇవి ఆగలేదు, వీటికి తోడుగా వలసలు ఒకటి.

ఈ సమస్యకి పరిష్కారం అసలేక్కడా దొరకడం లేదు. ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల గురించి చూస్తే ఏపీ – తెలంగాణా లో దారుణమైన ఆత్మహత్యలు జరుగుతున్నాయి. చనిపోయిన రైతుల కుటుంబాలకి రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ డబ్బులు ఇస్తాం అని ప్రకటించడం తో ఇంకా ఆత్మహత్యలు పెరుగుతూ వస్తున్నాయి. అయితే అంతటితో చేతులు దులిపెసుకోకుండా తాజాగా సీఎం చంద్రబాబునాయుడు ఆత్మహత్యలకు మూలాలు కనుగొనాలని… వాటిని నిరోధించాలంటే మూలాల నుంచి సమస్యను పరిష్కరించుకుంటూ రావాలని తలపోశారు. ఈ విషయం లో మంచిగా స్పందించారు చంద్రబాబు అని చెప్పాలి. 

కానీ తెలంగాణా లో ఆ మెరకు ఏదైనా అధ్యయనం చేస్తే బాగుంటుంది. చూసీ చూడనట్టు ఉండకుండా, డబ్బులు ఇచ్చేసి చేతులు దులిపెసుకోకుండా తమకి ప్రభుత్వం అండ ఉంది అనే సంకేతాలు రైతుల లోకి పంపితే బాగుంటుంది. తాను సీఎం అయిన తరువాత తెలంగాణలో అనేక వర్గాలకు న్యాయం చేసి… ఏళ్ల తరబడి ఉన్న సమస్యలనూ పరిష్కరించి భళా అనిపించుకున్నా రైతుల విషయంలో మాత్రం ఆయన చాలా మొండిగా ఉన్నారు కెసిఆర్ అని ఒక వాదన నడుస్తోంది దాన్ని ఆయనే తక్షణం స్పందించి ఖండించాలి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -