భారతదేశం గర్వించదగ్గ దర్శకుడు శంకర్ టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నట్లు ప్రకటన చేయగానే మెగా ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపారు. ఆర్ఆర్ఆర్ మూవీ పూర్తవగానే రామ్ చరణ్ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని అంతా భావించారు. అయితే అంతలోనే శంకర్ కు షాక్ తగిలింది. ప్రస్తుతం శంకర్ కమల్ హాసన్ తో ఇండియన్ 2 -సినిమా చేస్తున్నాడు. ఆయనకు ఆ సినిమా నిర్మాత లైకా ప్రొడక్షన్స్ వారితో విభేదాలు రావడంతో శంకర్ సినిమా నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నారు.
అనంతరం రామ్ చరణ్ తో ఒక సినిమా, హిందీలో అపరిచితుడు రీమేక్ సినిమాలను శంకర్ ప్రకటించాడు. అయితే దీనిపై లైకా ప్రొడక్షన్స్ చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇండియన్ -2 సినిమా పూర్తయ్యేంతవరకు శంకర్ మరో సినిమా చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. కొద్ది రోజులుగా ఈ కేసుకు సంబంధించి విచారణ హైకోర్టులో జరుగుతోంది. తాజాగా దర్శకుడు శంకర్ కు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది.
Also Read: ఇండియన్ -2 వివాదంలో కీలక మలుపు.. కోర్టు ఏం చెప్పిందంటే?
శంకర్ మరో సినిమా చేయకుండా చూడాలని లైకా ప్రొడక్షన్స్ వేసిన పిటీషన్ ను కోర్టు కొట్టివేసింది. దీంతో ఇక శంకర్ కొత్త సినిమా ప్రాజెక్టులకు లైన్ క్లియర్ అయినట్లేనని అంతా భావిస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. రెండు పాటలు మినహా ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయింది. ఆర్ఆర్ఆర్ నుంచి బయటకు రాగానే చరణ్ -శంకర్ సినిమా ప్రారంభమవుతుందని సమాచారం.
Also Read: లూసిఫర్ తర్వాత మొదలయ్యే చిరంజీవి సినిమాపై క్లారిటీ..!