Friday, May 3, 2024
- Advertisement -

ఇండియన్​ -2 వివాదంలో కీలక మలుపు.. కోర్టు ఏం చెప్పిందంటే?

- Advertisement -

ఇండియన్​ -2 ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించారు. శంకర్​ దర్శకత్వంలో కమల్​హాసన్​ హీరోగా ఎంతో గొప్పగా తెరకెక్కించాలని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా భావించింది. ఇక ప్రేక్షకుల్లోనూ ఈ చిత్రం పట్ల భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఆ చిత్రానికి మొదటి నుంచి ఆటంకాలే ఎదురయ్యాయి. ఇక నిర్మాణ సంస్థకు దర్శకుడు శంకర్​కు విబేధాలు రావడం.. వివిధ కారణాలతో ఈ మూవీ మధ్యలోనే ఆగిపోయింది. అయితే లైకా సంస్థ కోర్టుకు వెళ్లింది. తమ చిత్రాన్ని శంకర్​ ఆర్ధాంతరంగా ఆపేశారని.. ఆయన ఈ చిత్రం పూర్తి చేసేవరకు … మరే ఇతర చిత్రాలు చేయకుండా స్టే విధించాలని లైకా సంస్థ కోర్టుకు వెళ్లింది.

కానీ శంకర్​ మాత్రం వివిధ ప్రాజెక్టులను ఒప్పుకున్నారు. అపరిచితుడు చిత్రాన్ని హిందీలోకి రీమేక్​ చేస్తున్నాడు. అంతేకాక ప్రముఖ టాలీవుడ్​ హీరో రాంచరణ్​తేజ్​తో ఓ భారీ పాన్​ ఇండియా మూవీని తెరకెక్కించాలని చూస్తున్నాడు. ఈ కేసు తాజాగా విచారణకు వచ్చింది. బుధవారం కేసు విచారించిన మద్రాస్‌ హైకోర్టు ఆసక్తికరమైన తీర్పు ఇచ్చింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఓ మాజీ న్యాయమూర్తిని నియమించింది.

లైకా సంస్థకు దర్శకుడు శంకర్​కు మధ్య ఉన్న సమస్యను పరిష్కరించాలంటూ ఆ బాధ్యతను విశ్రాంత న్యాయమూర్తి భానుమతికి అప్పగించింది. ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపించాలని సూచించింది. విశ్రాంత న్యాయమూర్తి ఎటువంటి పరిష్కారం చూపిస్తోందో వేచి చూడాలి.

ఇక ఈ సినిమా ఆగిపోవడంతో కమల్​హాసన్​ కొన్ని వేరే చిత్రాలు చేస్తున్నాడు.ఆయన ప్రస్తుతం దృశ్యం రీమేక్​లో నటిస్తున్నాడు. శంకర్​ సైతం కొన్ని ఇతర ప్రాజెక్టులు ఒప్పుకున్నాడు. ఈ క్రమంలో మాజీ న్యాయమూర్తి ఈ సమస్యను ఎలా పరిష్కరించబోతున్నారో వేచి చూడాలి.

Also Read

ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా లైన్లోనే.. ఆగిపోలేదట..!

బాలయ్యకు నో చెప్పిన టబు.. అందుకేనా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -