- Advertisement -

బాబాయ్ మీకోక స‌ర్‌ప్రైజ్ అంటు రామ్ చ‌ర‌ణ్ పోస్ట్‌

- Advertisement -

జ‌న‌సేన అధినేత‌,న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ పుట్టిన రోజు రేపు(సెప్టెంబర్ 2).ఆయ‌న పుట్టిన రోజుని గ్రాండ్‌గా జ‌ర‌ప‌డానికి ఆయ‌న అభిమానులు సిద్ధం అవుతున్నారు.ఇప్పటికే సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టడం మొదలుపెట్టారు. ఆయన బర్త్ డే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు.తాజాగా పవన్ కళ్యాణ్ అన్నయ్య కొడుకు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తన బాబాయ్ పుట్టిన రోజ‌న స‌ర్‌ప్రైజ్ అంటు త‌న సోష‌ల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశాడు.”హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ బాబాయ్ పుట్టినరోజు సందర్భంగా ఓ స‌ర్‌ప్రైజ్ ఉంది. 24 గంటల్లో ఆ స‌ర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాను అంటు వెల్లడించాడు చరణ్.

మ‌రి ఆ స‌ర్‌ప్రైజ్ ఏమిటో తెలియాల్సి ఉంది.బోయపాటి దర్శకత్వంలో చరణ్ నటిస్తోన్న సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ ని పవన్ పుట్టినరోజు కానుకగా విడుదల చేయనున్నారని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంద‌రు రామ్ చ‌ర‌ణ్ ఫ‌స్ట్ లుక్ ప‌వ‌న్ పుట్టిన రోజున భావిస్తున్నారు. చ‌ర‌ణ్ ఇచ్చే ఆ స‌ర్‌ప్రైజ్ ఏంటో చూడాలి అంటే రేప‌టి వ‌ర‌కు ఆగాల్సిందే.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -