త్వరలో జరగనున్న ఆసియాకప్‌కు టీమిండియాను ప్రకటించింది సెలక్సెన్ కమిటీ. వరుసగా సిరీస్‌లు ఆడుతున్న కోహ్లీకి విశ్రాంతినిచ్చి కెప్టెన్‌గా రోహిత్ శర్మకు బాధ్యతలు అప్పగించారు. ఆస్ట్రేలియా టూర్ ఉండటంతో కోహ్లీకీ విశ్రాంతి నిచ్చిన సంగతి తెలిసిందే. అయితే పాకీస్థానీయులు మాత్రం కోహ్లీ ఎందుకు ఆడట్లేదో మాకు తెలుసులే అని సోషియల్ మీడియాలో రెచ్చగొడుతున్నారు.
గత ఏడాది జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాక్ భారత్‌ను ఓడించిన సంగతి తెలిసిందే. ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ 4 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇండియా 157 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ విరాట్ కోహ్లిని మహ్మద్ అమీర్ అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించాడు. ఏకపక్షంగా సాగిన ఆ మ్యాచ్‌లో అమీర్, హసన్ అలీ తలో మూడు వికెట్లు పడగొట్టారు. అమీర్ అద్భుతమైన బంతితో తనను ఔట్ చేశాడని కోహ్లి కూడా అంగీకరించాడు.
ఇప్పుడు ఇదే విషయాన్ని పాక్ క్రికెట్ ఫ్యాన్స్ కొందరు గుర్తు చేస్తున్నారు. అమీర్ కారణంగానే కోహ్లి ఆసియా కప్‌కి దూరం అవుతున్నాడు అనే అర్థం వచ్చేలా ట్వీట్లు పెడుతున్నారు. దీనికి భారత క్రికెట్ అభిమానులు అంతే ఘాటుగా బదులిస్తున్నారు.
Virat Kohli rested for the Asia Cup. Rohit Sharma to lead India at the Asia Cup in UAE. We all know why. 😂😂😂😂😂
— Ahsan. 🇵🇰 (@imPakistaniLAD) September 1, 2018
Virat Kohli Rested. The last time India sent a stand-in Captain at Asia Cup, this happened.
😂😂@imVkohli pic.twitter.com/dR5ZfWXL5Q— Waq@R @li (@HereWaqar) September 1, 2018
