Saturday, April 27, 2024
- Advertisement -

ఆచార్య షూటింగులో రామ్ చరణ్ ఎప్పుడంటే..?

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా ఆచార్య కొసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈసినిమా షూటింగ్ కరోనాకు ముందు 40శాతం పూర్తి అయింది. లాక్ డౌన్ తర్వాత ఇటీవలే ఈ సినిమా షూటింగును తిరిగి హైదరాబాదులో ప్రారంభించారు. అయితే చిరంజీవికి కరోనా పాజిటివ్ రావడం.. తర్వాత నెగిటివ్ వచ్చింది. అయితే నిబంధనల మేరా షూటింలో ఇంకా జాయిన్ కాలేదని తెలుస్తోంది.

సినిమాలో 30 నిమిషాల పాటు ఉండే ఒక కీలక పాత్రను రామ్ చరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగులో బిజీగా ఉన్న రామ్ చరణ్ ఆచార్య సినిమా షూటింగులో పాల్గొనలేకపోతున్నారు. మనకందుతున్న సమాచారం ప్రకారం జనవరి మూడో వారంలో రామ్ చరణ్ ఆచార్య సినిమా షూటింగులో జాయిన్ అవుతాడట. రామ్ చరణ్ కోసం ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ను దర్శకుడు కొరటాల శివ ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాలు అనుకుంటున్నాయి. అంతేకాకుండా ఒక సాంగ్ లో చిరంజీవి రామ్ చరణ్ లు కలిసి నటిస్తారంట.

అయితే మధ్యనే పెళ్లి చేసుకుని హనీమూన్ లో బిజీగా ఉన్న కాజల్ అగర్వాల్ కూడా డిసెంబర్ 5 నుంచి షూటింగ్ లో పాల్గొన బోతుందట. ఇక అప్పుడే చిరంజీవి కూడా జాయిన్ కాబోతున్నాట్టు తెలుస్తుంది. దర్శకుడు కొరటాల శివ వీరిద్దరి కాంబినేషన్ సన్నివేశాలను ముందుగా చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ సినిమాకి మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు.

ఈ హీరోయిన్స్ చిన్నప్పటి నుంచే సినిమాలు చేస్తున్నారు..!

పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన సినిమాలు ఇవే..!

సొంత మరదల్ని పెళ్లి చేసుకున్న హీరోలు వీరే..!

దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీరే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -