Tuesday, April 23, 2024
- Advertisement -

వామ్మో.. పుష్ప లో తోమ్మిది మంది విలన్స్ అంటా..?

- Advertisement -

1980ల నేపథ్యంలో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రంగస్థలం ఎంత పెద్ద హిట్ అందుకుందో అందరికి తేలిసిందే. అదే నేపథ్యంలో ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో ఇప్పుడు దర్శకుడు సుకుమార్ ’పుష్’ సినిమా తో మళ్లి మనముందుకు రాబోతున్నాడు. అల్లు అర్జున్ సుకుమార్ కాంబో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్నా సినిమా పుష్ప పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. వీరి కాంబో లో ఆర్య, ఆర్య 2 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇందులో అల్లు అర్జున్ ఓ లారీ డ్రైవర్ పుష్పరాజ్ గా కనిపించబోతున్నాడు.

అయితే పుష్ప సినిమాలో విలన్ పై మొదటినుంచి రోజు కో పేరు వినిపిస్తుంది. మొదట్లో ఈ సినిమా కి తమిళ నటుడు విజయ్ సేతుపతి ని విలన్ గా ఫిక్స్ చేయగా డేట్ సమస్య వల్ల ఆయన ఈ సినిమా కి దూరమయ్యారు.. తర్వతా ఒకరిద్దరు తమిళ, హిందీ నటుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. కాని తాజాగా ఇప్పుడు గతంలో అల్లు అర్జున్ వరుడు సినిమాలో విలన్ గా నటించిన తమిళ నటుడు ఆర్య పేరు కూడా తెరపైకి వచ్చింది.

తాజాగా పుష్ప సినిమాలో 9 మంది విలన్స్ అంటూ ఫిల్మ్ నగర్ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇందులో రావు రమేష్, ముఖేష్ రుషి, టాలీవుడ్ లో విలన్లుగా నటించిన మరి కొందరు ఈ సినిమాలో విలన్ గ్యాంగ్ లో కనిపించబోతున్నాడట. అంతేకాదు ఈ మధ్య కాలంలో నెగెటివ్ పాత్రలవైపు మొగ్గు చూపుతున్నా నటుడు సునీల్ కు కూడా ఓ పాత్ర దక్కిందని సమాచారం. ఇప్పటికే డిస్కో రాజా, కలర్ ఫోటో సినిమాల్లలో నెగెటివ్ పాత్రలు పోషించాడు. సినిమాలో డిఫరెంట్ తరహాలో సాగే నెగెటివ్ పాత్ర కోసం సునీల్ ని ఎంచుకున్నట్టు సమాచారం.

సొంత మరదల్ని పెళ్లి చేసుకున్న హీరోలు వీరే..!

మన స్టార్స్ నోరు జారినప్పుడు.. జరిగిన వివాదం..!

మన హీరోలు ఎంత వరకు చదువుకున్నారో తెలుసా ?

మన టాలీవుడ్ హీరోయిన్స్ ఏం చదువుకున్నారో తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -