Tuesday, May 21, 2024
- Advertisement -

సినిమాలో పాత్ర కోసం హార్స్ రైడింగ్!

- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన తని ఒరువన్ సినిమాని తెలుగులో రిమేక్ చేస్తున్నాడు. అయితే తాజా అందుతున్న సమాచారం కోసం రామ్ చరణ్ ఓ కఠినమైన  ఫిట్ నెస్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు.

ఈ చిత్రంలో రామ్ చరణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. తాను చేసేది చాలా టఫ్ రోల్ కావడంతో పాత్రకు తగిన విధంగా తయారయ్యేందుకు ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఇందులో భాగంగా రోజూ గంటల తరబడి హార్స్ రైడింగ్, సైక్లింగ్ చేస్తున్నారు. సినిమాలో పాత్ర కోసం రామ్ చరణ్ కాస్త బరువు కూడా తగ్గాల్సి ఉందని, అందుకోసం చాలా కష్టపడుతున్నాడని రామ్ చరణ్ స్పోక్ పర్సన్ తెలిపారు.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే మొదలు కావాల్సి ఉన్నా… రామ్ చరణ్ సోదరి శ్రీజ వివాహం కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం రామ్ చరణ్ అన్ని పనుల నుండి ఫ్రీ కావడంతో సినిమా షూటింగులో జాయిన్ అయ్యేందుకు సిద్ధమయ్యారు. ఈచిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. ప్రస్తుతం ‘ధృవ’ అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. తర్వాతి షెడ్యూల్ కాశ్మీర్ లో ప్రారంభం కానుందని తెలుస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రంలో రామ్ చరణ్ కొత్తగా కనిపించబోతున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. అరవిందస్వామి ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. హిప్ హాప్ తమీజా సంగీతం అందిస్తుండగా, అసీమ్ మిశ్రా సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. దసరా నటికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -