Tuesday, May 7, 2024
- Advertisement -

తమిళ సినిమాలపై మనసు పడింది!

- Advertisement -

తెలుగులో మెగా ఫ్యామీలికి ఏ రెంజ్ లో అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. అయితే చిరుకి ఎంత పాలోయింగ్ వచ్చిందో అలానే చరణ్ కూడా అతి తక్కువ కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే మెగా అభిమానులు చిరంజీవి 150వ చిత్రం కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారు.

తమిళంలో సూపర్ హిట్ అయిన కత్తి సినిమాని తెలుగులో చిరు 150వ చిత్రంగా తీస్తున్నారు. వినాయక్ దర్శకత్వంలో తెరకేక్కుతున్న ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మించడం విశేషం. ఇటివలే ఈ చిత్రం ప్రారంభం కూడా అయింది. అలాగే రామ్ చరణ్ కూడా ప్రస్తుతం తమిళంలో సూపర్ హిట్ అయిన తని ఓరువన్ చిత్రాన్నితెలుగులో రీమేకే చేస్తున్నాడు. సూరేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకేక్కుతుంది.

అయితే చిరు, చరణ్ ఎందుకు ఇలా తమిళంలో హిట్ అయిన సినిమాలే తీసుకొని తెలుగులో తెరకేక్కిస్తున్నారు. అంటే తెలుగులో తమ సినిమాలకు కథలు అందించే రచయితలే లేరా? అని కొందరు అంటూన్నారు. తెలుగులో కూడా చాలా మంది అద్భుతంగా కథలు రాసే రచయితలు ఉన్నారు అయిన ఇలా చేయడం అన్యాయం అంటున్నారు.

తెలుగు పరిశ్రమ బాగుండాలి అంటే ఇక్కడ ఉన్న రచయితలకు అవకాశం ఇవ్వాలి కాని తమిళంలో హిట్ అయిన సినిమాలు తీసుకొని ఇక్కడ తీయడం ఎందుకు అనే వారు ఉన్నారు. అయితే తెలుగులో మంచి కథలు అందించే రచయితలు లేకపోవడం వల్ల ఇలా తమిళ సినిమాలను రిమేక్ చేసుకోవాల్సి వస్తుందని మరి కొందరు అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -