Thursday, May 16, 2024
- Advertisement -

ప్రధానిపై కాంగ్రెస్ ఘాటు విమర్శలు

- Advertisement -

కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ప్రజాస్వామ్యం హత్యకు గురైందని కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. సేవ్ డెమక్రసీ పేరుతో కాంగ్రెస్ పార్టీ న్యూఢిల్లీలో ర్యాలీ చేపట్టింది. జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకూ ఈ ర్యాలీని చేపట్టారు.

ఇందులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తదితరులు పాల్గొన్నారు. దేశంలో రైతులు, పేదల బతుకులు నానాటికి అంధకారంగా తయారవుతున్నాయని విమర్శించారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాలను తొలగించడం దారుణమని, ఈ చర్యలకు పాల్పడుతూ నరేంద్రమోదీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని అన్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, నరేంద్రమోదీల ఇష్టారాజ్యంగా పాలన సాగుతోందని , వారి మాటే ఇక్కడ చెల్లుబాటవుతోందని రాహుల్ ధ్వజమెత్తారు. రెండేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేస్తోందని, వీరి నుంచి దేశాన్ని కాపాడాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలుపునిచ్చారు.

ఈ ర్యాలీలో పాల్గొన్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆత్మను గంగానదితో పోల్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్ర నేతలు, కార్యకర్తలు పార్లమెంట్ ముట్టడికి యత్నించారు. కొంతసేపటి తర్వాత సోనియా, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్ పోలీసులకు లొంగిపోయారు. వీరిని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ కు తరలించి కొంతసేపటి తర్వాత వారిని వదిలేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -