Monday, June 17, 2024
- Advertisement -

మ‌రో రికార్డు చేరువ‌లో రంగస్థలం

- Advertisement -

రాంచ‌ర‌ణ్ తాజా చిత్రం రంగ‌స్థ‌లం సినిమా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తుంది.విడుద‌ల రోజు నుండే సినిమా పాజిటివ్ టాక్ సూప‌ర్ హిట్‌తో న‌డుస్తుంది.ఇప్పటికే నాన్-బాహుబలి ఇండస్ట్రీ హిట్టు దిశగా దూసుకుపోతున్న ‘రంగస్థలం’ ఇప్పుడు మరో రికార్డు తిరగరాయడానికి అతి చేరువలో ఉంది. అది రామ్ చరణ్ బాగా వీక్ అయిన నైజాం ఏరియాలో ఈ సినిమా మంచి క‌లెక్ష‌న్స్‌తో దూసుకుపోతుంది.రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన ‘మగధీర’ సినిమా నైజాంలో దాదాపు 22 కోట్ల షేర్ రాబట్టింది.

ఈ సినిమా త‌రువాత చెర్రీ మాత్రం మగధీర తర్వాత మళ్లీ ఆ స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయాడు. ఇప్పుడు ‘రంగస్థలం’ సినిమాతో చరణ్ కి ఆ అవకాశం దొరికింది. ఈ వారంతంలో ‘మగధీర’ వసూళ్లను దాటేయబోతోంది ‘రంగస్థలం’. వచ్చే వారం ఇలాగే కలెక్షన్లు కొనసాగితే ఏకంగా 25 కోట్ల షేర్ క్లబులో కూడా చిట్టిబాబు చేరే అవకాశం ఉంది. వ‌చ్చేవారం సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు రంగంలో దిగుతాడు.కాబ‌ట్టి ఈలోపే రాంచ‌ర‌ణ్ ఈ రికార్డు చేరువ కావ‌లి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -