Saturday, May 4, 2024
- Advertisement -

రామ్ చ‌ర‌ణ్ తండ్రి కాబోతున్నాడా..?

- Advertisement -

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ పెళ్లి అయి దాదాపు 7 సంవ‌త్స‌రాలు పూర్తి కావ‌స్తోంది. అయితే వీరిద్ద‌రు ఇప్ప‌డు వ‌ర‌కు పిల్ల‌ల్ని క‌న‌లేదు. ఆ మ‌ధ్య ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గోన్న ఉపాస‌న‌కు మీరు పిల్ల‌లు గురించి ప్లాన్ ఇంకా ఏం ప్లాన్ చేసుకోలేదా అంటూ యాంక‌ర్ ఆమెను ప్ర‌శ్నించింది. పిల్ల‌ల్ని క‌నడం అనేది మా వ్య‌క్తిగ‌తం. ఇద్ద‌రం బిజీగా ఉండ‌టం వ‌ల్ల పిల్ల‌లు గురించి ఆలోచించ‌డం లేద‌ని జవాబిచ్చింది. అటు రామ్ చ‌ర‌ణ్ కూడా త‌న సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. రామ్ చ‌ర‌ణ్ తరువాత పెళ్లి చేసుకున్న స్టార్స్ ఇప్ప‌టికే ఇద్ద‌రు పిల్ల‌ల్ని క‌నేశారు. అయితే తాజాగా రామ్ చ‌ర‌ణ్ భార్య ఉపాస‌న గ‌ర్భ‌వ‌తి అయింద‌టూ వార్త‌లు వ‌స్తున్నాయి. పెళ్లి చేసుకున్న చాలా సంవ‌త్స‌రాలు త‌రువాత ఈ జంట తల్లిందండ్రులుగా మార‌బోతున్నారంటూ సోష‌ల్ మీడియాలో ఓ వార్త హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

అయితే ఈ వార్త‌ల్లో నిజం లేద‌ని మెగా కాపౌండ్ చెబుతోంది. ఇలాంటి వార్త‌లు ఎక్క‌డి నుంచి వ‌స్తాయో కూడా తెలియ‌ద‌ని చెబుతోంది మెగా కుటుంబం. అయితే ఈ వార్త రావ‌డానికి కార‌ణం ఉపాస‌న‌నే అని తెలుస్తోంది. ఈ మ‌ధ్య ఉపాస‌న కాస్తా లావుగా మారింద‌ట‌. లూజుగా ఉన్న డ్రెస్‌లు వేసుకుని రెండు , చోట్ల క‌నిపించింది ఉపాస‌న‌. దీంతో అంద‌రు ఉపాస‌న గ‌ర్బ‌వ‌తి అని, రామ్ చ‌ర‌ణ్ తండ్రి కాబోతున్నాడ‌ని వార్త‌లు అలేశాయి. ఉపాస‌న గ‌ర్భ‌వ‌తి అనే వార్త‌ల్లో ఏమాత్రం నిజం లేద‌ని తెలిపోయింది. ఉపాస‌న అపోలో ఆస్ప‌త్రి ఎండీగా వ్య‌వ‌హారిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇటు రామ్ చ‌ర‌ణ్ కూడా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తు ఫుల్ బిజీగా ఉన్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -